MLC Kavitha: కవితకు షాక్ ఇచ్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సీబీఐ మరోసారి షాక్ ఇచ్చింది. 91 సి ఆర్ పీ సి కింద మరోసారి నోటీసులు జారీ చేసింది.

MLC Kavitha: కవితకు షాక్ ఇచ్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు..
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 11, 2022 | 11:31 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్ఎల్సి కవితకు సీబీఐ మరోసారి షాక్ ఇచ్చింది. 91 సిఆర్పీసి కింద మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. అంతకుముందు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ. 160 సీఆర్పీసీ కింద వివరణ తీసుకున్నామని.. అవసరమైతే కవితకు మళ్లీ నోటీసులిచ్చి విచారిస్తామని సీబీఐ ప్రకటించింది. ఏడున్నర గంటలకు పైగా కవిత న్యాయవాది సమక్షంలో కొనసాగిన విచారణ మొత్తాన్ని రికార్డ్‌ చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. వారిలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు.

ఈ క్రమంలో కవిత నివాసం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో అధికారులు.. ప్రిపేర్ చేసుకున్న ప్రశ్నావళిని కవిత ముందుంచి ప్రశ్నించారు. ప్రధానంగా అమిత్ అరోరా రిమాండ్‌ రిపోర్ట్‌.. సౌత్ గ్రూప్‌ ముడుపుల వ్యవహారం.. ఢిల్లీ మంత్రి సిసోడియా, శరత్ చంద్రారెడ్డిలతో పరిచయాలు.. సెల్‌ఫోన్ల ధ్వంసంపై ఆరాతీసినట్టు సమాచారం. అలాగే కాల్‌ లిస్ట్‌, పలు కీలక డాక్యుమెంట్లపైన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సాక్షిగా మాత్రమే కవితను విచారించారు.

ఇవి కూడా చదవండి