YS.Sharmila: షర్మిల హెల్త్ బులెటిన్ విడుదల.. అప్పటి వరకు విశ్రాంతి తప్పనిసరి.. వైద్యుల సూచన..
స్వల్ప అస్వస్థతకు గురై.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లోబీపీ, బలహీనత వల్ల ఆమెను ఆస్పత్రిలో...
స్వల్ప అస్వస్థతకు గురై.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లోబీపీ, బలహీనత వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. షర్మిలకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నాయన్నారు. ఈరోజు లేదా రేపు ఉదయం డిశ్ఛార్జి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్యం సహకరించేంత వరకు రెండు నుంచి మూడు వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ రెండు రోజులుగా షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం విషమిస్తుండటంతో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు లోటస్‌పాండ్‌కు చేరుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీక్షను భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్చారు.
అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం షర్మిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. షర్మిలకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ విజయమ్మ అపోలో ఆస్పత్రికి చేరుకుని షర్మిలను పరామర్శించారు. షర్మిలకు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ప్రవీణ్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో షర్మిల ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం