క్యాంపస్‌ క్వార్టర్స్‌లో ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి.. !

ఐఐటీ గువహతి క్యాంపస్‌ క్వార్టర్స్‌లో ఓ ప్రొఫెసర్‌ శనివారం (డిసెంబర్‌ 10) ఆనుమానాస్పదరీతిలో మృతి చెంది ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకెళ్తే..

క్యాంపస్‌ క్వార్టర్స్‌లో ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి.. !
suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 11, 2022 | 9:59 PM

ఐఐటీ గువహతి క్యాంపస్‌ క్వార్టర్స్‌లో ఓ ప్రొఫెసర్‌ శనివారం (డిసెంబర్‌ 10) ఆనుమానాస్పదరీతిలో మృతి చెంది ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకెళ్తే.. ఐఐటీ గువహతి క్యాంపస్‌లో సమీర్ కమల్ (47) పదేళ్ల నుంచి మ్యాథమెటిక్స్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అవివాహితుడైన ప్రొఫెసర్‌ క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. గత మూడు రోజులుగా క్యాంపస్‌లో కనిపించడం లేదని, శుక్రవారం సాయంత్రం పైగా అతని క్వార్టర్స్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలి నుంచి లాక్‌ చేసి ఉన్న గది తలుపులను పగలగొట్టి చూడగా.. ప్రొఫెసర్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. మేజిస్ట్రేట్ సమక్షంలో అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఎస్పీ హితేష్ సీహెచ్‌ రే మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా తేలింది. ఐతే గదిలో ఎటువంటి సూసూడ్‌ నోట్‌ కనిపించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం క్లిక్‌ చేయండి.