Gold Silver Rate: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పెరుగుతున్న పసిడి, వెండి ధరలకు బ్రేక్ పడింది.
Gold Silver Rate Today: బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పెరుగుతున్న పసిడి, వెండి ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.49,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,450 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.68,100 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,590 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440 లుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 గా కొనసాగుతోంది.
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490 గా ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440 గా ఉంది.
- హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440 గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440 ఉంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,100 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.68,100, చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000, బెంగళూరులో రూ.73,000, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,000, విజయవాడలో రూ.73,000, విశాఖపట్నంలో రూ.73,000 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..