వీడేం మనిషిరా బాబు.. భోజనంలో తల వెంట్రుక వచ్చిందని.. ఏకంగా కట్టుకున్న భార్యకే..
ఒక్కొక్కరూ ఒకో రకం.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోపంలో చేసే పనులు తర్వాత మనకే విసుగు పుట్టిస్తాయి. అందుకే కోపం వచ్చినప్పుడు కాస్త శాంతించి.. రెండు నిమిషాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెబుతుంటారు. సాధారణంగా ఇంట్లోనే కాకుండా..
ఒక్కొక్కరూ ఒకో రకం.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోపంలో చేసే పనులు తర్వాత మనకే విసుగు పుట్టిస్తాయి. అందుకే కోపం వచ్చినప్పుడు కాస్త శాంతించి.. రెండు నిమిషాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెబుతుంటారు. సాధారణంగా ఇంట్లోనే కాకుండా.. రెస్టారెంట్లు, హోటల్స్‌లో మనం తినే ఫుడ్‌లో తలవెంట్రుకలను చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఎంతో కోపానికి లోనవుతూ ఉంటారు. రెస్టారెంట్లో అయితే సారీ చెప్పి.. తిరిగి వేరే ఫుడ్ ఇస్తుంటారు. కాసేపు హోటల్ వాడితో వాదించి.. మన మట్టుగ మనం తిరిగి వచ్చేస్తాం. కాని ఇంట్లో తినే ఆహారంలో వెంట్రుక వస్తే చాలామంది సర్ధుకుపోతుంటాం. కాని ఓ భర్త మాత్రం భోజనంలో తల వెంట్రుక వచ్చిందని కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు. భోజనం చేస్తుండగా ఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపంతో భార్యపై వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు.. భర్త, అత్తమామలు కలిసి ఆ మహిళకు గుండు కొట్టించారు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది. మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్‌కు, సీమాదేవికి ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు తనను వేధిస్తున్నారని సీమాదేవి తెలిపింది. గత శుక్రవారం రాత్రి ఇంట్లో మహిళ వంట చేసింది. తర్వాత ఆమె తన భర్తకు ఒక ప్లేట్‌లో భోజనం వడ్డించింది.
భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్లేట్‌లో వెంట్రుకలు రావడంతో భర్త జహీరుద్దీన్‌కు కోపం వచ్చింది. ఈ నేపథ్యంలో తన భార్యకు గుండు కొట్టించాడు. అన్నదమ్ములు జమీరుద్దీన్ బరాసత్, జులేఖా ఖాతూన్‌లతో కలిసి తన భర్త తనను కొట్టారని పిర్యాదులో పేర్కొంది మహిళ. తన చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డను బిగించి.. ఆ తర్వాత లైంగిక దాడికి ప్రయత్నించారని.. మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
భర్త క్రూరత్వానికి పాల్పడుతున్నాడని, తన భర్తను రెచ్చగొట్టి బావమరిది, అత్తమామలు సహకరిస్తున్నారని మహిళ తెలిపింది. ఘటన అనంతరం వివాహిత ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా.. నిందితులపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..