UPSC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలు తప్పనిసరి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న.. 19 నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కైవిస్ట్ (జనరల్) తదితర పోస్టుల భర్తీకి..

UPSC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలు తప్పనిసరి..
UPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 11, 2022 | 4:14 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న.. 19 నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కైవిస్ట్ (జనరల్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో స్పెషలిస్ట్ గ్రేడ్-3 (పీడియాట్రిక్స్), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో సైంటిస్ట్ ‘బి’ (న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిప్లొమా, హిస్టరీ/కెమిస్ట్రీ/ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 29, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.