AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: రంజీ ట్రోఫీలో రెచ్చిపోయిన సంజూ శామ్సన్‌.. 7 సిక్సర్లు, 4 ఫోర్లతో తుపాన్‌ ఇన్నింగ్స్

ట్యాలెంట్‌ ఉన్న టీమిండియాలో చోటు దక్కించుకోని సంజూశామ్సన్‌ రంజీ ట్రోఫీ2022-23 లో అదరగొట్టాడు. ఈరోజు (డిసెంబర్‌ 13) జార్ఖండ్‌తో మొదలైన మ్యాచ్‌లో కేరళ కెప్టెన్‌ రెచ్చిపోయాడు. మొత్తం 108 బంతుల్లో 72 పరుగులు చేసి కేరళ భారీస్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Sanju Samson: రంజీ ట్రోఫీలో రెచ్చిపోయిన సంజూ శామ్సన్‌.. 7 సిక్సర్లు, 4 ఫోర్లతో తుపాన్‌ ఇన్నింగ్స్
Sanju Samson
Basha Shek
|

Updated on: Dec 13, 2022 | 9:29 PM

Share

ట్యాలెంట్‌ ఉన్న టీమిండియాలో చోటు దక్కించుకోని సంజూశామ్సన్‌ రంజీ ట్రోఫీ2022-23 లో అదరగొట్టాడు. ఈరోజు (డిసెంబర్‌ 13) జార్ఖండ్‌తో మొదలైన మ్యాచ్‌లో కేరళ కెప్టెన్‌ రెచ్చిపోయాడు. మొత్తం 108 బంతుల్లో 72 పరుగులు చేసి కేరళ భారీస్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండడం విశేషం. అతనికి తోడు రోహన్‌ కున్నుమ్మల్‌ (50), రోహన్‌ ప్రేమ్‌ (79) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది కేరళ జట్టు. ప్రస్తుతం అక్షయ్‌ చంద్రన్‌ (39), సిజోమోన్‌ జోసఫ్‌ (28) క్రీజ్‌లో ఉన్నారు. ఇక జార్ఖండ్‌ బౌలర్లలో షాబాజ్‌ నదీమ్‌ 3 వికెట్లు పడగొట్టగా, ఉత్కర్ష్‌ సింగ్‌ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా నయా సెన్సేషన్‌ ఇషాన్‌ కిషాన్‌ బ్యాటింగ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

కాగా బంగ్లాదేశ్ పర్యటనలో గాయపడ్డ రిషబ్‌ పంత్‌ స్థానంలో సంజూశామ్సన్‌ను ఎంపిక చేస్తారని అతని అభిమానులు ఆశించారు. వన్డే జట్టుతో పాటు టెస్టుల్లోనూ ప్లేస్‌ దక్కుతుందని భావించారు. అయితే ఎప్పటిలాగే మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. దీంతో రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. కేరళ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరి రంజీ ట్రోఫీలో ప్రదర్శనను ఎక్కవ ప్రామాణికంగా తీసుకునే బీసీసీఐ సంజూను టీమిండియాలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...