Weding Video: పెళ్లిపీటలపైనే వధూవరుల ఫైటింగ్‌.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఏదేమైనా సరే జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినందుకు వధూవరులు కాస్త సంతోషంగానే ఉంటారు. అయితే ఇటీవల కొందరూ వధూవరులు పెళ్లిపీటలపైనే గొడవకు దిగుతున్నారు. చిన్న చితకా కారణాలతో అతిథుల ముందే పొట్టుపొట్టుగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Weding Video: పెళ్లిపీటలపైనే వధూవరుల ఫైటింగ్‌.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Bride Groom Fight
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2022 | 7:22 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వెల్లువెత్తుతున్నాయి . ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ అయినా, సోషల్ మీడియా యొక్క అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వివిధ రకాల పెళ్లి వీడియోలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఎమోషనల్‌గా ఏడిపిస్తాయి. ముఖ్యంగా వధువుకు అత్తారింటికి వెళ్లేటప్పుడు కాస్త భావోద్వేగాలు ఉంటాయి. ఏదేమైనా సరే జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినందుకు వధూవరులు కాస్త సంతోషంగానే ఉంటారు. అయితే ఇటీవల కొందరూ వధూవరులు పెళ్లిపీటలపైనే గొడవకు దిగుతున్నారు. చిన్న చితకా కారణాలతో అతిథుల ముందే పొట్టుపొట్టుగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో వారి గొడవకు కారణం చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోలో వధూవరులు పెళ్లి వేదికపై ఒకరితో ఒకరు పోట్లాడుతుండడం మనం చూడవచ్చు. వరుడు బలవంతంగా వధువుకు మిఠాయిలు తినిపించడంతోఈ గొడవ మొదలవుతుంది. వధువుకు ఇష్టం లేకపోయినా స్వీట్లు తినిపించడంతో వరుడి చేతిని దూరంగా విసిరేస్తుంది. అంతేకాదు గట్టిగా వరుడిని కొట్టేస్తుంది. దీంతో వరుడు కూడా కోపోద్రిక్తుడై వధువును రెండుసార్లు కొట్టాడు. దీని తర్వాత పెళ్లి వేదిక కాస్తా యుద్ధ వేదికగా మారుతుంది. కొద్ది సేపట్లోనే వధూవరులు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఈ ఫన్నీ వీడియో @gharkekalesh అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశాను. కేవలం 27 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అలాగే వేలమంది నెటిజన్లు లైకులు కురిపించారు.

ఇవి కూడా చదవండి

పెళ్లంటేనే భయమేస్తోంది..

ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇది పెళ్లా? విడాకుల కార్యక్రమమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ గొడవ చూశాక పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తోంది’ అంటూ మరో యూజర్‌ కామెంట్ చేశాడు. అయితే ఇది నకిలీ వీడియో అని, ఫ్రాంక్‌ అని, సోషల్‌ మీడియాలో అటెన్షన్‌ కోసమే అలా వీడియో చేశారంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..