Viral: అరే ఏంట్రా ఇది.. ఎగ్జామ్ పెట్టింది 800 మార్కులకు.. వచ్చింది అంతకుమించి.. స్కోర్ చూస్తే..

సాధారణంగా ఏ పరీక్ష పెట్టినా.. విద్యార్ధులకు నిర్దేశించిన మార్కులకు ఒకటో.. అరో తక్కువ వస్తుంటాయి. ఎవ్వరికీ కూడా ఆ మార్కుల..

Viral: అరే ఏంట్రా ఇది.. ఎగ్జామ్ పెట్టింది 800 మార్కులకు.. వచ్చింది అంతకుమించి.. స్కోర్ చూస్తే..
Students
Follow us

|

Updated on: Dec 13, 2022 | 7:01 PM

సాధారణంగా ఏ పరీక్ష పెట్టినా.. విద్యార్ధులకు నిర్దేశించిన మార్కులకు ఒకటో.. అరో తక్కువ వస్తుంటాయి. ఎవ్వరికీ కూడా ఆ మార్కుల కంటే ఎక్కువ రావు. కానీ ఇక్కడ విచిత్రమేంటంటే.. విద్యార్ధులకు పరీక్షల్లో నిర్దేశించిన మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. ఉదాహరణకు 100కు పరీక్ష నిర్వహిస్తే.. ఆ స్కోర్‌కు అంతకుమించి మార్కులు స్టూడెంట్స్‌కు వచ్చాయి. దీనితో విద్యార్ధులకు ఆ మార్కులు చూసి దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన ఆంధ్రపదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు 800 మార్కులకు గానూ 2 వేలకు పైనే మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తాము ఏ గ్రేడ్‌లో పాసయ్యామో తెలియక డిగ్రీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. యూనివర్సిటీలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా, వాటి ఫలితాలను వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ మార్కులు తప్పులు తడకగా ఉండడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థులందరికీ ఇలా 2 వేలకు పైగానే మార్కులు రావడంతో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి .. మార్కుల జాబితాలో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?