Viral Video: గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం పోసిన మహిళా పోలీస్.. వీడియో వైరల్
వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటుకు గురై మరణించిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్ఐ.
ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటుకు గురై మరణించిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కూర్చీలో కూర్చున్న వ్యక్తి అమాంతం అలాగే ప్రాణాలు విడిచాడు. స్నేహితులతో సరదాగా వాకింగ్ చేస్తూ..ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. మరోచోట బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనల్లో కొన్ని సందర్భాల్లో బాధితుల్ని సీపీఆర్ చేసిన కాపాడిన ఘటనలు కూడా మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరోకటి జరిగింది.
రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్‌ఐ. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు.
మహిళా ఎస్ఐ పేరు సోనం పరషార్. రొటీన్ చెకింగ్‌లో భాగంగా రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం చూసి సీపీఆర్ చేసింది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
पुलिस वाली इन दीदी को प्रणाम..ग्वालियर में एक व्यक्ति को राह चलते हार्ट अटैक आ गया। चौराहे पर तैनात ट्रैफिक एस आई सोनम पाराशर द्वारा CPR देकर उनकी जान बचाई गई। @DGP_MP pic.twitter.com/2UhtsH5Lv5
— Rajendra kumar चौधरी साहब (@Raj160793) December 12, 2022
అయితే సదరు వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి బాగానే ఉన్నాడని ఎస్‌ఐ సోనమ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రత్యక్ష సాక్షులు, ఇతరులు లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి