AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Voltage Drama: అత్తారింటి ముందు హైవోల్టేజీ డ్రామా.. ఇంట్లోకి రానివ్వడం లేదని ఆ కోడలు ఏం చేసిందో చూస్తే..

వర కట్నం కోసం అత్తమామలు తనను హింసించేవారని దీపికా ఆరోపించింది. తన భర్త కూడా తనకు భార్య హోదా ఇవ్వలేదని ఆరోపించింది. అత్తమామలు తన తండ్రి ఆస్తిపై కన్నేశారని, ఆస్తి చిక్కకపోవటంతో తనను వేధించటం మొదలుపెట్టారని వాపోయింది.

High Voltage Drama: అత్తారింటి ముందు హైవోల్టేజీ డ్రామా.. ఇంట్లోకి రానివ్వడం లేదని ఆ కోడలు ఏం చేసిందో చూస్తే..
High Voltage Drama
Jyothi Gadda
|

Updated on: Dec 13, 2022 | 4:51 PM

Share

కాన్పూర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత మహిళ తమ ఇంట్లోకి వెళ్లేందుకు నిచ్చెన సాయంతో పైకెక్కెందుకు ప్రయత్నించింది. ఈ హై-వోల్టేజ్ డ్రామాను చూసిన సమీపంలోని ఇళ్ల నివాసితులు షాక్‌ అయ్యారు. ఈ తతంగమంతా తమ మొబైల్‌ ఫోన్‌లలో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వార్త వైరల్‌గా మారింది. ఈ ఘటన నయోబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని హంసాపురంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ మహిళ మొదట తన అత్తామామల ఇంటి బయట కూర్చుని ఉండటం కనిపించింది. తనను ఇంట్లోకి రానివ్వాలంటూ అత్తామామలను వేడుకుంటుంది. అయితే, ఎవరూ డోర్‌ తెలియలేదు. తనను లోనికి రానివ్వలేదు. దీంతో ఎలాగైన ఇంట్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ యువతి..వెంటనే నిచ్చెన సాయంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అత్తమామలు తనను కొట్టారని, ఇంట్లోకి రానివ్వలేదని మహిళ ఆరోపించింది. అత్తమామలతో ఇబ్బంది పడుతున్న ఆ మహిళ ఇప్పటికే పోలీసులను ఆశ్రయించింది. కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కొన్ని నెలలుగా అత్తమామల వద్దకు రావడం లేదని తెలిసింది.

బాధిత మహిళ ఫిర్యాదుదారు దీపిక బన్స్వర్ధన్ సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సయోధ్య కుదరలేదు. దీంతో ఇద్దరి మధ్య బంధం బెడిసికొట్టింది. మరోవైపు కట్నం కోసం అత్తమామలు తనను హింసించేవారని దీపికా సింగ్ చౌహాన్ ఆరోపించింది. ఆమె భర్త ఆమెకు భార్య హోదా ఇవ్వలేదని కూడా ఆరోపించింది. అత్తమామలు తన తండ్రి ఆస్తిపై కన్నేశారని, ఆస్తి చిక్కకపోవటంతో తనను వేధించటం మొదలుపెట్టారని వాపోయింది.  రూ. 3 లక్షల నగదు తీసుకురావాలని ఇటీవల భర్త, అత్తమామలు అడిగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, పెళ్లి తర్వాత తన భార్య ప్రవర్తన సరిగా లేదని దీపిక భర్త బన్స్‌వర్ధన్ సింగ్ చౌహాన్ ఆరోపించాడు. తన భార్య దీపిక తనపై అనేక కేసులు పెట్టించదని చెప్పాడు. దీంతో పాటు విడాకుల అంశం కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. గత కొన్ని రోజులుగా దీపిక ఇంట్లోనే నటిస్తోందని ఆరోపించాడు.ఈ క్రమంలోనే అందరూ చూస్తుండగా, నిచ్చెన సాయంతో ఇంట్లోకి ప్రవేశించి లక్షల నగదు, నగలు దోచుకెళ్లిందని ఆరోపించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి