Trending Video: వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు.. మండిపడుతున్న భక్తులు..

ఈ ఘటన వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ సహా రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయి. దేవాలయాల్లో దేవుడి కంటే ముఖ్యమంత్రి కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

Trending Video: వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు.. మండిపడుతున్న భక్తులు..
Temple Deity
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 13, 2022 | 3:21 PM

ఆలయ పూజారులు, సిబ్బంది అత్యుత్సాహం ముఖ్యమంత్రికే మచ్చను తెచ్చిపెట్టేలా చేసింది. ఆలయ సందర్శనకు వచ్చిన సీఎం భార్యను వర్షంలో తడవకుండా చూసేందుకు ఆలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవుడి విగ్రహానికి పట్టాల్సిన ముత్యాల గొడుగును తాపడం సీఎం భార్యకు పట్టారు. వర్షంలో దేవుడిని నల్లటి గొడుగు కిందే ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా వేదికగా ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సమీపంలో గల తిరువత్తిర్ త్యాగరాజ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా ఆలయాన్ని సందర్శించినప్పుడు వర్షం కురిసింది. అప్పుడు కొంతమంది సిబ్బంది దేవుడికి పట్టాల్సిన ముత్యాల గొడుగును సీఎం స్టాలిన్‌ భార్య దుర్గకు పట్టి గుడి బయటికి తీసుకెళ్లారు.

ఉత్సవాల్లో దేవుడి ఊరేగింపు జరుగుతుండగా, వానలో తడవకుండా దేవుడికి పట్టాల్సిన ముత్యాల గొడుగును ముఖ్యమంత్రి సతీమణి కోసం ఉపయోగించారు. బదులుగా దేవుడు తడవకుండా ఉండటానికి నల్ల గొడుగును వాడారు. ఈ వీడియోను రచయిత్రి షెఫాలీ వైద్య ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ సహా రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయి. దేవాలయాల్లో దేవుడి కంటే ముఖ్యమంత్రి కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ముత్యాల గొడుగును ఉపయోగించిన ఘటనలో ముఖ్యమంత్రి భార్య పాత్ర లేదని ఆమె వెంట ఉన్న వారు వివరణ ఇచ్చారు. వర్షం కురుస్తుండటంతో కొంతమంది ముత్యాల గొడుగులతో వచ్చారు. ఇది గుడిలో కొంతమంది సిబ్బంది చేసిన పనిగా వారు వెల్లడించారు. అయితే, ఆ సమయంలో దుర్గ అడ్డుకోకపోవడమే ఇక్కడ పెద్దతప్పుగా వారు పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా ఈ ఘటనను బీజేపీ ఎంకే స్టాలిన్‌పై అస్త్రంగా మార్చుకుంది. స్టాలిన్‌ను విమర్శిస్తూ బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి ఓ వీడియోను ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే దీనిపై డీఎంకే ఇంకా స్పందించలేదు. డీఎంకే నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!