Bride Father: కూతురు మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ తండ్రి మృతి.. వధువుకి నాన్న గురించి చెప్పకుండా పెళ్లి చేసిన మేనమామ ఎక్కడంటే..

కూతురికి పెళ్లి చేసి.. మరో ఇంటికి పంపే ఆనంద క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.. అయితే కూతురి పెళ్లి జరుగుతుందన్న ఆనందం ఆ తండ్రి పూర్తిగా అనుభవించనేలేదు. తన కుమార్తె వివాహాన్ని ఆసాంతం చూడకుండానే తనువు చాలించాడు ఓ తండ్రి.

Bride Father: కూతురు మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ తండ్రి మృతి.. వధువుకి నాన్న గురించి చెప్పకుండా పెళ్లి చేసిన మేనమామ ఎక్కడంటే..
Bride's Father Dies While Dancing Day
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2022 | 3:31 PM

సృష్టిలో తియ్యండి తండ్రి కూతుళ్ల మధ్య ప్రేమ.. వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతురు అంటే  తండ్రికి మరో అమ్మే.. అసలు కూతురుపై తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉందేమో అనిపిస్తుంది కూడా. ఆ కూతురికి నాన్న అంటే ఆకాశమంత ప్రేమ. ఇంటిలో కూతురు మహారాణి.. లక్ష్మీదేవి తన ఇంట్లో నడయాడుతుందని నాన్న తన కూతురిని ఎంతో గారంగా పెంచుకుంటాడు. తనకు కూతురు పుట్టినపట్టి నుంచి మరో ఇంటికి కోడలుగా అడుగు పెట్టేవరకూ అల్లారుముద్దుగా అరచేతుల్లో పెట్టుకుని పెంచుతాడు తండ్రి. కూతురికి పెళ్లి చేసి.. మరో ఇంటికి పంపే ఆనంద క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.. అయితే కూతురి పెళ్లి జరుగుతుందన్న ఆనందం ఆ తండ్రి పూర్తిగా అనుభవించనేలేదు. తన కుమార్తె వివాహాన్ని ఆసాంతం చూడకుండానే మెహందీ ఫంక్షన్ రోజున తనువు చాలించాడు ఓ తండ్రి. అంతకంటే విషాదం ఏమిటంటే.. ఆ తండ్రి మరణించిన విషయం కూతురుకి తెలియనివ్వకుండా.. తండ్రికోరికను తీరుస్తూ మేనమామ పెళ్లి చేశాడు. మనసుని కదిలించే ఈ హృదయ విదారక    సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరాఖండ్‌ అల్మోరాలో పెళ్లి సందర్భంగా ఆ ఇంట్లో మెహందీ ఫంక్షను వైభవంగా జరుగుతోంది. డిసెంబర్‌ 12న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో డిసెంబర్‌ 11న మెహందీ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులంతా ఆనందంగా డాన్స్‌ చేస్తున్నారు. వధువు తండ్రికూడా వారితో కలిసి డాన్స్‌ చేశారు. కూతురి వివాహం జరుగుతుందన్న ఆనందంలో ఆ తండ్రి ఎంతో సంబరంగా నృత్యం చేశారు. అయితే ఆ తండ్రి కుమార్తె వివాహం చూడకుండానే మృత్యు ఒడికి చేరుకున్నాడు. మెహందీ ఫంక్షన్‌లో డాన్స్‌ చేస్తుండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే, ఈ విషయం కుమార్తెకు చెబితే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖాన్ని గుండెలోనే దాచిపెట్టుకుని నిర్ణయించిన ముహూర్తానికే ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివాహం జరిపించారు. కన్యాదానాన్ని వధువు తండ్రి కాకుండా మేనమామ నిర్వహించేందుకు రావడంతో వధువుకు అనుమానం వచ్చింది. అయితే తన తండ్రికి ఆరోగ్యం బాలేదని, అత్యవసర పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారని చెప్పి కన్యాదానం జరిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?