AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. నాలుగేళ్ళ ప్రేమకు మూడు నిమిషాల్లో అంగీకారం ఎక్కడంటే..

తాజాగా ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లాడు. ప్లాన్‌ బెడిసికొట్టి.. ఇంట్లో వారి కంట బడడంతో బావిలో దూకేసాడు. ఈ వింత ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. తర్వాత ఏం జరిగిదంటే.. 

Love Story: ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. నాలుగేళ్ళ ప్రేమకు మూడు నిమిషాల్లో అంగీకారం ఎక్కడంటే..
Real Life Love Story
Surya Kala
|

Updated on: Dec 12, 2022 | 4:30 PM

Share

ప్రేమ అదొక అందమైన భావన అంటారు ప్రేమికులు.. అందుకనే తాము ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు.. ఎంతటి త్యాగానికైనా సిద్ధ పడతారు కొందరు. తాము ప్రేమించిన వారి కోసం తమ ప్రేమను దక్కించుకోడానికి ఎంతటి సాహసమైనా చేస్తారు. ఇది చరిత్ర చెప్పిన నిజం.. అయితే తాజాగా ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లాడు. ప్లాన్‌ బెడిసికొట్టి.. ఇంట్లో వారి కంట బడడంతో బావిలో దూకేసాడు. ఈ వింత ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. తర్వాత ఏం జరిగిదంటే..

ఛాప్రా జిల్లా మోతీరాజ్‌పూర్‌కు చెందిన మున్నారాజ్‌ అనే వ్యక్తి తను ప్రేమించిన యువతిని కలుసుకునేందుకు యువతి ఇంటికి వెళ్లాడు. అదికూడా అర్ధరాత్రి వేళ. ఆ రాత్రి వేళ ఆ ఇంట్లో ప్రేయసి జాడ కనుక్కునే క్రమంలో యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. రాత్రివేళ శబ్దాలు రావడంతో ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని భావించిన యువతి కుటుంబ సభ్యులు లేచి చూశారు. దాంతో మున్నారాజ్‌ వాళ్లకంటపడ్డాడు. వాళ్లను చూసి పారిపోబోయాడు మున్నారాజ్‌. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు అతని వెంటపడ్డారు. దాంతో వాళ్లబారినుంచి తనను తాను కాపాడుకోడానికి మున్నారాజ్‌ దగ్గర్లోని బావిలోకి దూకేసాడు. అయితే తమ పెళ్ళికి ఒప్పుకుంటేనే తాను బావినుంచి బయటకు వస్తానని షరత్ పెట్టాడు. దీంతో  ఎలాగోలా ఒప్పించి ప్రేమికుడిని బయటకు తీశారు.

అనంతరం ఘటనపై పంచాయితీ పెట్టారు యువతి కుటుంబ సభ్యులు. గ్రామ పెద్దలు ఇరు కుటుంబాలతో మాట్లాడి మున్నారాజ్‌కు తన ప్రేయసినిచ్చి గుడిలో వివాహం జరిపించారు. అలా మున్నారాజ్‌ ప్రేమకథ సుఖాంతమైంది. ఈ పెళ్లిలో ప్రేమికుడి బంధువులు పాల్గొనలేదు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచ్లా తెల్పా నివాసి అయిన ప్రేమికుడి పేరు మున్నా రాజ్ అని స్థానికులు తెలిపారు. ఆ అమ్మాయి పేరు సోని కుమారి, మోతిరాజ్‌పూర్‌లో యువతి ఇల్లు ఉంది. వీరిద్దరి మధ్య నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!