Mission MGM: ర్యాగింగ్‌ను అరికట్టడం కోసం విద్యార్ధిగా మారిన పోలీస్‌.. మొదటి కేసులోనే సక్సెస్ అందుకున్న యువతి

ఎంబీబీఎస్‌ ఈ ఏడాది జూలైలో ఫ‌స్టియ‌ర్ ఎంబీబీఎస్ విద్యార్థుల‌ను కొందరు ర్యాగింగ్ పేరుతో వేధించారు. వాట్సాప్ ద్వారా విద్యార్థులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ కేసును షాలినికి అప్పగించారు.

Mission MGM: ర్యాగింగ్‌ను అరికట్టడం కోసం విద్యార్ధిగా మారిన పోలీస్‌.. మొదటి కేసులోనే సక్సెస్ అందుకున్న యువతి
Mgm Medical College Canteen
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2022 | 3:46 PM

దొంగ‌ల్ని, నేర‌స్థుల‌ను ప‌ట్టుకునేందుకు కొన్నిసార్లు పోలీసులు వివిధ గెట‌ప్‌లు వేస్తుంటారు. మ‌ఫ్టీలో మాటు వేసి మ‌రీ ప‌ట్టుకుంటారు. మ‌ధ్యప్రదేశ్‌లోని ఒక మ‌హిళా పోలీస్ అచ్చం అలానే చేసింది. ఇండోర్‌లోని సన్యోగితగంజ్ స్టేష‌న్‌లో షాలిని చౌహ‌న్ ఈమ‌ధ్యే పోలీస్‌గా జాయిన్ అయింది. అధికారులు ఆమెకు ఎంజీఎం ర్యాగింగ్ కేసు అప్పగించారు. దాంతో ఈ ర్యాగింగ్‌ కేసు అంతు తేల్చాలనుకున్న షాలిని ఎంజీఎం కాలేజ్‌ స్టూడెంట్‌గా అవతారమెత్తింది.

ఎంబీబీఎస్‌ ఈ ఏడాది జూలైలో ఫ‌స్టియ‌ర్ ఎంబీబీఎస్ విద్యార్థుల‌ను కొందరు ర్యాగింగ్ పేరుతో వేధించారు. వాట్సాప్ ద్వారా విద్యార్థులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ కేసును షాలినికి అప్పగించారు. ర్యాగింగ్ కేసు అనుమానితుల‌ను ప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగిన షాలిని చౌహాన్‌ అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. అందుకోసం ఏకంగా కాలేజీ స్టూడెంట్‌గా మారింది. బీకామ్ చ‌దివిన ఆమె న‌ర్సుగా కాలేజీలో ఎంట‌ర్ అయింది. అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటూ ఫ్రెండ్స్ చేసుకుంది. షాలిని పోలీస్ అని ఎవ‌రూ క‌నిపెట్టలేక‌పోయారు. ఆమె కాలేజీ క్యాంటీన్‌, క్యాంప‌స్‌లో రోజుకు 6 గంట‌లు ఉంటూ ర్యాగింగ్‌కు పాల్పడే వాళ్లను గ‌మ‌నించేది.

సీక్రెట్ ఆప‌రేష‌న్ ద్వారా 11 మంది సీనియ‌ర్ విద్యార్థుల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. వాళ్లపై సీఆర్‌పీఎఫ్ 41ఏ సెక్షన్ కింద కేసు న‌మోదు చేశారు. దాంతో, పలువురు షాలినిని అభినందిస్తూ సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా షాలిని తండ్రి కూడా పోలీస్‌గా పనిచేసేవారు. అయితే ఆయన 2010లో చనిపోవడంతో షాలిని పోలీస్‌ అవ్వాలని నిర్ణయించుకుంది. ఖాకీ చొక్కా వేసుకొని మొద‌టి కేసునే విజయవంతంగా ఛేదించి ప్రశంస‌లు అందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..