- Telugu News Photo Gallery Cricket photos Team Iindia cricketer Shardul Thakur and Miittali Parulkar tie the knot in february
Shardul Thakur: బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పనున్న టీమిండియా క్రికెటర్.. శార్దూల్, మిథాలీల పెళ్లికి ముహూర్తం ఫిక్స్
భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతనికి కాబోయే భార్య మితాలీ పారుల్కర్ పెళ్లి తేదీని అధికారికంగా ధృవీకరించింది. గత ఏడాది మిథాలీతో శార్దూల్ నిశ్చితార్థం జరిగింది.
Updated on: Dec 17, 2022 | 2:26 PM

భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతనికి కాబోయే భార్య మితాలీ పారుల్కర్ పెళ్లి తేదీని అధికారికంగా ధృవీకరించింది. గత ఏడాది మిథాలీతో శార్దూల్ నిశ్చితార్థం జరిగింది.

ఫిబ్రవరి 27న శార్దూల్, మిథాలీ పెళ్లి చేసుకోనున్నట్లు మిథాలీ తెలిపింది. దీంతో పాటు వివాహ సన్నాహాలను కూడా ఆమె తెలియజేసింది.

ఫిబ్రవరి 25 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయని బ్యాంకింగ్ స్టార్టప్ వ్యవస్థాపకురాలు మితాలీ తెలిపారు. కాగా శార్దూల్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఫిబ్రవరి 24 వరకు క్రికెట్ మ్యాచ్‌లు ఆడనున్న అతను ఫిబ్రవరి 25 నుంచి వివాహ వేడుకలకు హాజరుకానున్నాడు.

శార్దూల్, మిథాలీల పెళ్లి వేడుకకు దాదాపు 200 నుండి 250 మంది అతిథులు పాల్గొననున్నారు. ముంబైలోని ఓ లగ్జరీ హోటల్ వీరి పెళ్లికి వేదిక కానుంది.

శార్దూల్, మితాలీల పెళ్లికి డిజైనర్లు కూడా ఖరారయ్యారు. తన వివాహ కేక్‌ను తానే తయారు చేస్తానని మిథాలీ తెలిపింది. కాగా శార్దూల్ ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్నాడు.





























