Sreeleela: థియేటర్‌లో టికెట్లు అమ్మిన పెళ్లిసందడి హీరోయిన్‌.. ఫొటోల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌

అభిమానుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈసారి మాస్‌ మహారాజా రవితేజతో కలిసి మన ముందుకు వస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం ధమాకా. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం.

Sreeleela: థియేటర్‌లో టికెట్లు అమ్మిన పెళ్లిసందడి హీరోయిన్‌.. ఫొటోల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌
Sreeleela
Follow us

|

Updated on: Dec 17, 2022 | 7:15 PM

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి రివ్వున దూసుకొచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా మరో తెలుగు సినిమాలో నటించలేదు శ్రీలీల. అభిమానుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈసారి మాస్‌ మహారాజా రవితేజతో కలిసి మన ముందుకు వస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం ధమాకా. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్‌, ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్‌ శ్రీల హైదరాబాద్‌ లో సందడి చేసింది. నగరంలోని ఓ థియేటర్‌లో ధమాకా అడ్వాన్స్‌ టికెట్లు అమ్మి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీలీలను చూసిన ఫ్యాన్స్‌ ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా రవితేజ, శ్రీలలతో పాటు చిత్రబృందమంతా నగరమంతా పర్యటిస్తోంది. అభిమానులను కలుస్తోంది. తాజాగా శ్రీలీల కూడా ఓ థియేటర్‌లో సందడి చేసింది. మొదట అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. ఆతర్వాత ఏకంగా టికెట్‌ కౌంటర్‌లో కూర్చుని టికెట్లు అమ్మింది. హీరోయిన్‌ టికెట్‌ కౌంటర్లో ప్రత్యక్షం కావడంతో అభిమానులు టికెట్లు కొనేందుకు భారీగా ఎగబడ్డారు. కాగా త్రినాథ్‌ రావ్‌ నక్కిన దర్శకత్వం వహిస్తోన్న ధమాకా సినిమాలో జయరాం, తనికెళ్ల భరణి, సచిన్‌ ఖేడ్కర్‌, రావు రమేశ్‌, అలీ, ప్రవీణ్‌, హైపర్‌ ఆది, పవిత్రా లోకేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు