Jabardasth Varsha: వాళ్లంతా నన్ను అందుకే దూరం పెట్టారు.. నాతో మాట్లాడలేదు.. జబర్దస్త్ వర్ష..
జబర్దస్త్ వర్ష గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన వర్ష.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. తన కెరీర్ ఆరంభంలో కుటుంబం, ముఖ్యంగా అక్కచెల్లెళ్ల నుండి ఎదుర్కొన్న వ్యతిరేకతను పంచుకుంది. జబర్దస్త్ లో వచ్చిన గుర్తింపుతో కుటుంబం ఆమెను అంగీకరించిందని, అది తన జీవితంలో మర్చిపోలేని బహుమతి అని తెలిపింది.

జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వర్ష, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను తన పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. ఆమె సినీరంగ ప్రవేశం, కుటుంబం నుండి ఎదురైన తొలి ప్రతిఘటన, ఆ తర్వాత జబర్దస్త్ తో లభించిన గుర్తింపు, కుటుంబంతో సయోధ్య వంటి అంశాలపై ఆమె మాట్లాడారు. తొలుత తాను సినిమాలు, ఆ తర్వాత సీరియల్స్ చేసి, ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చానని వర్ష వివరించారు. ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన అక్కచెల్లెళ్లు తనతో మాట్లాడేవారు కాదని ఆమె గుర్తు చేసుకున్నారు. “నువ్వు మా చెల్లివని ఎక్కడా చెప్పొద్దు” అని కూడా అనేవారని, దీనివల్ల తాను చాలా బాధపడేదాన్నని వర్ష భావోద్వేగంగా వెల్లడించారు. ఈ ఫీల్డ్ అంటే వారికి ఇష్టం లేకపోవడం, “మీ చెల్లి ఏంటి ఇట్లా” అని చుట్టుపక్కల వారు అనడం వల్ల వారు ఇబ్బంది పడి అలా అన్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆది గారితో చేసిన స్కిట్ ల ద్వారా ప్రజల్లో గుర్తింపు లభించిన తర్వాత పరిస్థితి మారిందని వర్ష వివరించారు. “మీ చెల్లి జబర్దస్త్ లో కనిపించింది, ఆది గారి స్కిట్‌లో కనిపించింది, చాలా బాగుంది” అని ప్రజలు చెప్పడం మొదలుపెట్టారని, దీంతో తన కుటుంబం, అక్కచెల్లెళ్లు మళ్లీ తనతో మాట్లాడటం మొదలుపెట్టారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తన తల్లి మాత్రం ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచిందని, ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా వెనుక ఉండి సహాయం చేసిందని వర్ష కృతజ్ఞతలు తెలిపారు. జబర్దస్త్ తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ తన కుటుంబంతో మళ్లీ కలపడమే అని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
సోషల్ మీడియాలో తన పోస్టుల గురించి, దానివల్ల ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే ప్రశ్నకు వర్ష సమాధానమిస్తూ, తన కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ చూడరని తెలిపారు. అయితే, బంధువులు లేదా ఇతరులు చూసి అనుకోవచ్చు అని అంగీకరించారు. తాను చేసే పనులు కొంతమందికి సహాయపడతాయని కుటుంబానికి తెలుసని వర్ష వివరించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చే డబ్బును కొంతమందికి సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నానని, అంతేకాకుండా ప్రతి ఏటా, ప్రతి నెలా తన కుటుంబం కూడా కొంతమందికి సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. డబ్బుల కోసమే కాకుండా, తనకి కొన్ని ఫ్యాషన్స్, ఇష్టాలు, సరదాలు కూడా ఉన్నాయని వర్ష స్పష్టం చేశారు. ఇప్పటివరకు తన కుటుంబ సభ్యులు తన పోస్టుల గురించి తనతో ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
ఈ సందర్భంలో, యూట్యూబ్ స్కిట్స్ టీమ్ నుండి ఒకరు వర్ష మంచి మనసున్న వ్యక్తి అని, మధ్యాహ్నం మంచి ఫుడ్ తెప్పించేదని పటాస్ ప్రవీణ్ చెప్పుకొచ్చారు. అలాగే, ఆమెపై ఎన్నో డైలాగులు వేసి ఆడుకున్నా, ఆమె వాటిని స్వీకరించే వ్యక్తిత్వం గొప్పదని, అందుకే ఈ మంచి పొజిషన్‌లో ఉన్నారని తెలిపారు. దీనిపై వర్ష స్పందిస్తూ, ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక చాలా కష్టం, బాధ ఉందని, తనను ఈ స్టేజ్ లో నిలబెట్టినవారు, ఆదరించినవారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
జబర్దస్త్ వర్ష..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..
