Gold: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. మరో కొద్ది నెలల్లో రికార్డ్ స్థాయికి.. అసలు లెక్కలివే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. గోల్డ్ రేట్లను ఎప్పటికప్పుడు ప్రజలు పరిశీలిస్తూ ఉంటాయి. ధరలు ఎలా ఉంటాయనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గోల్డ్ ధరలపై ఓ కీలక అంచనా వెలువడింది.

బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో గోల్డ్ రేటు ఒక్కసారిగా రూ.3 వేలకుపైగా పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం రూ.1.55 లక్షల వద్ద కొనసాగుతోంది. అయితే రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి, ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు అంచనాలు వంటివి ధరలపై పెద్ద ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల బంగారంలోకి పెట్టుబడులు పెరిగాయి. ధరలు పెరగడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో బంగారం ధరలు కూడా ఆమాంతం పెరుగుతూ వస్తోన్నాయి.
గోల్డ్ రేట్లు రూ.1.93 లక్షలకు చేరుకునే ఛాన్స్
ఈ క్రమంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయనే అంచనా వెలువడుతున్నాయి. పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంచలన అంచనా విడుదల చేసింది. వచ్చే 12 నుంచి 15 నెలల్లో గోల్డ్ రేట్లు రూ.1.93 లక్షలకు చేరుకోవచ్చంటూ బిగ్ బాంబ్ పేల్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 4800 డాలర్లకు పెరగవచ్చని, రాబోయే కొద్ది నెలల్లో 5500 డాలర్లకు చేరుకునే అవకాశముందని జోస్యం చెప్పింది. ఈ ఏడాది జనవరిలో తులం బంగారం రూ.1.85 లక్షలకుపైగా చేరుకుంది. అయితే రూ.1.90 లక్షలకు చేరుకుంటే అది ఆల్ టైం రికార్డ్ స్థాయిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగా సంస్థలు తమ అంచనాలను వేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఆర్ధికంగా ఏమైనా మార్పులు జరిగాయి. పరిణామాలు మారినా బంగారం ధరలు తారుమారు అవుతాయి. దీంతో ఈ అంచనాలు కరెక్ట్ అవుతాయనేది ఎవరూ చెప్పలేరు. ప్రపంచ మార్కెట్లలో ద్రవ్య లభ్యత, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై సంకేతాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్ వంటివి బంగారం ధరలను నిర్ణయిస్తాయి. ఇక అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం, వెండిలో భారీగా పెట్టుబడులు పెడుుతున్నాయి. ఇక స్పెక్యులేషణ్ కూడా బులియన్ ర్యాలీకి దోహదపడే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగింది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. విలువైన లోహంతో పాటు పారిశ్రామిక లోహంగా కూడా దీనికి డిమాండ్ ఉంది. విద్యుదీకరణ, ఈవీ రంగాల డిమాండ్‌తో ముడిపడి ఉన్నందున దాని ధరలలో అత్యంత తీవ్రమైన హెచ్చుతగ్గులు నమోదు కావచ్చని అంటున్నారు. దీంతో వెండి ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని నివేదిక హెచ్చరించింది. మరి బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయనేది చూడాలి.
