AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illu Illalu Pillalu: పేరు, గోత్రం లేని అనాథను.. పూజారితో రామరాజు.. ఘోరంగా అవమానించే భద్రావతి

Illu Illalu Pillalu August 11th Episode Review: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజు ఆగస్ట్‌ 11వ తేదీ స్టార్‌ మాలో రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

Illu Illalu Pillalu: పేరు, గోత్రం లేని అనాథను.. పూజారితో రామరాజు.. ఘోరంగా అవమానించే భద్రావతి
Illu Illalu Pillalu August 11th EpisodeImage Credit source: JioHotstar
Sharada V
| Edited By: |

Updated on: Aug 11, 2026 | 10:36 AM

Share

రామరాజు, భద్రావతి కుటుంబాలు ఆటో ఇంకా కారులో గుడి ముందు దిగుతారు. స్థాయి తక్కువ వాళ్లతో బంధుత్వం కలిపాడు భగవంతుడనీ సేనతో అంటుంది భద్రావతి. హారతి పళ్లెంలో తక్కువ డబ్బులు వేసిన రామరాజును ఈసడించుకుంటారు. ఈ ఎపిసోడ్‌లో సేన, భద్రావతి రెచ్చిపోయి రామరాజును అవమానించడం, దేవుడి ముందు అందరూ సమానమే అని రామరాజు కౌంటర్‌ ఇవ్వడం ఆసక్తిగా సాగుతుంది. ఇంటి పేరు గోత్రం లాంటివి మాకు లేవు.. దేవుడి పేరు మీదే అర్చన చేయండి … నా జీవితాన్ని అనాథగా మొదలుపెట్టాను అంటాడు రామరాజు. ఒక మనిషికి తను అనాథ అని చెప్పుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి పూజారిగారూ .. భద్రావతి అగ్నికి ఆజ్యం పోస్తుంది.

ప్రేమ ధీరజ్‌లను కలపాలన్న అత్తయ్య ప్లాన్‌ మొత్తం చెడగొట్టాను. ఇంకో ప్లాన్ వేసి నర్మదను బయటకు పంపిస్తా.. అప్పుడు నేనే ఆ ఇంటికి మహరాణి నా మాటే శాసనం అవుతుంది. సుకన్యతో అంటుంది వల్లి.

రామరాజు గుడిలో ఒంటరిగా ఉండటం చూసి సేన, భద్రావతి కార్నర్‌ చేస్తారు. హారతి పళ్లెంలో రామరాజు పది రూపాయలు వేస్తాడు. ఇదీ వాడి స్థాయి చూసావా అక్కా..దేవుడు దిక్కుమాలిన వాళ్లతో మనకు బంధుత్వం కలుపుతాడు.. ఏ జన్మలో చేసుకున్న పాపమో.. వేదవతికి నువ్వు అక్కగా.. నేను అన్నగా పుట్టి తప్పు చేసాం.. ఇలాంటి వాళ్లు తలకి చుట్టుకున్నారు.. భద్రావతితో సేన అంటాడు. హారతి పళ్లెంలో ఐదు వందలు వేసే స్తోమత లేదు.. మాతో సమానంగా కలిసిపోవాలని ట్రై చేస్తున్నావా. నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకెళ్లి నీలాగా దొంగ పెళ్లి చేసుకున్నాడు. నీ కొడుకు ఎలాంటి వాడో తెలుసుకుని నా మేనకోడలు మా దగ్గరికి తిరిగొచ్చింది.. మాయమాటలతో మళ్లీ తీసుకుపోవాలని నీ కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది అది జరగనివ్వను .. రామరాజుతో భద్రావతి అంటుంది.

Illu Illalu Pillalu August 11th Episode Review

Illu Illalu Pillalu August 11th Episode Review

ప్రేమతో మాట్లాడి ఇట్నుంచి ఇటే ఇంటికి తీసుకెళదామని ఆశ పడ్డాను కానీ అక్క భద్రావతి ప్రేమ చేతిని వదిలిపెట్టడం లేదు నర్మదతో అంటుంది వేదవతి. ప్రేమతో మాట్లాడటం మిస్‌ అయి ఉండొచ్చు అయితే గుడి నుంచి వెళ్లే లోపు ఛాన్స్‌ దొరుకుతుందిలే అమ్మా ధీరజ్ అంటాడు. మేం త్వరగా వెళ్లాలి.. పూజ త్వరగా జరిపించండి.. భద్రావతి తొందరపెడుతుంది. అమ్మవారి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరగాలి.. హడావిడిగా అర్థాంతరంగా ముగించకూడదు. అంటారు పూజారి. ఇక్కడ్నించి ఎంత త్వరగా వెళితే అంత మంచిది అంటే.. ఏంటక్కా నువ్వు.. ఎవరికో భయపడి మనం ఎందుకు వెళ్లాలి.. ఎవ్వరైనా మనకి భయపడాలి.. సేన అంటాడు. సింధూరం భార్య నుదుటున పెట్టి భర్త ఆశీర్వాదించాలి.. పర్లేదు లెండి అని ప్రేమ అంటే.. అలా అనకూడదు.. కుంకుమ సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం . భర్తతో భార్య నుదుట కుంకుమ పెట్టించుకుంటే .. సౌభాగ్యవతిగా ఉండమని ముక్కోటి దేవతలు దీవిస్తారు కాదంటే అరిష్టం అంటారు పూజారి.

ప్రేమ ఇబ్బందిగా పూజారిని చూసి.. అలా ఏమీ జరగదు లెండి అంటుంది. పూజారి అంతలా చెప్తుంటే మూర్ఖంగా ప్రవర్తిస్తావేంటి? ప్రేమతో వేదవతి అంటుంది. నేను భార్యనే కాదు అని ధీరజ్ చెబుతుంటే ఏ హక్కుతో బొట్టు పెట్టించుకోవాలి .. చిరాకుపడ్డ ప్రేమ లేచి వెళ్లిపోతుంది. ధీరజ్‌ కూడా అక్కడ్నుంచి వెళతాడు. వాళ్లు మాట్లాడుకోకుండా వెళ్లండి.. వల్లి భద్రావతిని అలర్ట్‌ చేస్తుంది. పూజ అయ్యేదాకా ఎక్కడికీ వెళ్లకు అక్కా.. సేన భద్రావితో అంటాడు. వెళ్లాలని ప్రేమ ధీరజ్ కలవకుండా చేయాలని అనిపించినా ఏం మాట్లాడలేక కూర్చుండిపోతుంది భద్రావతి. అమూల్య విశ్వాపై పూలు విసురుతుంది. నా మీద పువ్వులు ప్రేమతో కదా విసిరావు విశ్వా అంటాడు. ప్రేమా దోమా అని విసిగించకు.. ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చేయి చాలు.. విశ్వాతో అమూల్య అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

Follow Us