Vijay Devarakonda: ‘ఈరోజు నేను ఆ పని చేశాను’.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన విజయ్‌

వరుస పరాజయల తర్వాత విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రమే 'ఖుషి'. మజిలి, నిన్నుకోరి వంటి అద్భుత ప్రేమ కథలను తెరకెక్కించిన శివ నిర్వాణ.. ఖుషి చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలకు ముందు విడుదలైన చిత్ర ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. పెళ్లి తర్వాత జంటల మధ్య తలెత్తే...

Vijay Devarakonda: 'ఈరోజు నేను ఆ పని చేశాను'.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన విజయ్‌
Vijay Devarakonda
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 01, 2023 | 12:08 PM

విజయ్‌ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఈ పేరు ఒక సెన్సేషన్‌. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా మంచి నటుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక రెండో సినిమా అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. కల్ట్‌ మూవీతో రికార్డులను తిరగరాశాడు.

తనదైన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. భారీ కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఇక అనంతరం గీత గోవిందం, ట్యాక్సీవాలా వంటి చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత విజయ్‌ని వరుస అపజయాలు వెంటాడాయి. డియర్‌ కామ్రెడ్‌, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే పూరీతో చేతులు కలిపాడు. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లైగర్‌ మూవీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇలా వరుస పరాజయల తర్వాత విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రమే ‘ఖుషి’. మజిలి, నిన్నుకోరి వంటి అద్భుత ప్రేమ కథలను తెరకెక్కించిన శివ నిర్వాణ.. ఖుషి చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలకు ముందు విడుదలైన చిత్ర ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. పెళ్లి తర్వాత జంటల మధ్య తలెత్తే భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించాడు శివ నిర్వాణ.

ఇవి కూడా చదవండి

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వరుస అపజయాలతో ఇబ్బందుల్లో ఉన్న విజయ్‌కి బూస్ట్‌నిచ్చింది. లైగర్‌ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషీ మూవీ.. విజయ్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమాలో ఎమోషన్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్‌ తర్వాత మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విజయ్‌ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు.

విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

Vijay

సినిమా విజయం సాధించడంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయ్‌.. ‘మీరంతా ఐదేల్ల నుంచి నాతో ఉన్నారు. నేను చేయాల్సిన పనికోసం ఎంతో ఓపికగా ఎదురు చూశారు. ఈరోజు నేను ఆ పనిని చేసి చూపించాను. చాలా మంది మెసేజ్‌లు చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. అందరికీ లవ్ యూ. ఈ సినిమాకు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయండి. నాకు తెలుసు మీరు వెళతారు. మీ విజయ్ దేవరకొండ’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..