Yogurt Benefits: ప్రతి రోజూ పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా.. అస్సల్ మిస్ చేయకండి!

పెరుగు.. ఇది లేనిదే ఆహారం పూర్తి కాదు. పెరుగు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన మంచి పోషలకాలను అదిస్తుంది పెరుగు. పోషకాలు నిండుగా ఉండే ఆహార పదార్థం పెరుగు అని చెప్పవచ్చు. ప్రతి రోజూ పెరుగుతో ఆహారం తీసుకోవడం వల్ల బాడీని చల్ల బరుస్తుంది. కడుపులోని యాసిడ్ స్థాయిల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయ పడుతుంది పెరుగు. ఇందులో లక్టోకోకస్, లాక్టోబాసిల్లస్, స్ట్రప్టోకోకస్ వంటి..

Yogurt Benefits: ప్రతి రోజూ పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా.. అస్సల్ మిస్ చేయకండి!
Yogurt
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 03, 2023 | 8:39 PM

పెరుగు.. ఇది లేనిదే ఆహారం పూర్తి కాదు. పెరుగు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన మంచి పోషలకాలను అదిస్తుంది పెరుగు. పోషకాలు నిండుగా ఉండే ఆహార పదార్థం పెరుగు అని చెప్పవచ్చు. ప్రతి రోజూ పెరుగుతో ఆహారం తీసుకోవడం వల్ల బాడీని చల్ల బరుస్తుంది. కడుపులోని యాసిడ్ స్థాయిల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయ పడుతుంది పెరుగు. ఇందులో లక్టోకోకస్, లాక్టోబాసిల్లస్, స్ట్రప్టోకోకస్ వంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగ పడతాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియాతో పాటు మినరల్స్, విటమిన్లు ఉంటాయి. పెరుగుతో ఒక్కటేంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ప్రోటీన్ అధికంగా ఉంటుంది:

పెరుగులో శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, పాస్పరస్ కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా తినొచ్చు.

ఇవి కూడా చదవండి

ఎముకల సమస్య ఉండదు:

క్రమం తప్పకుండా ఆహారంలో పెరుగును తీసుకుంటే.. ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల ఆరోగ్యంలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుంది చిన్న పిల్లలకు కూడా వారి ఆహారంలో పెరుగును చేర్చితే.. వారు దృఢంగా తయారవుతారు. ఎముకల విరుగుళ్లను, ఆర్థరైటిస్, ఆస్టియో పొరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చూస్తుంది.

ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వ్యాధి రాకుండా చూస్తుంది:

తరచూ పెరుగును తీసుకోవడం వల్ల బరువు పెరుగుట, పేగుల వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. బిలోఫిలా వాస్ట్ వర్టియా అనే చెడు బ్యాక్టీరియాలో గణమైన తగ్గుదల ఉంటుంది. పెరుగు తింటే.. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వ్యాధి రాదు.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

పెరుగు తింటే గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. పెరుగులో మంచి కొవ్వు పదార్థాలు గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. రక్త పోటును తగ్గడానికి సహాయపడుతుంది.

షుగర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

పెరుగు రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే కొవ్వు అధికంగా లేని తీపి ఎక్కువగా ఉన్న పెరుగును తీసుకంటే బరువు పెరగకుండా, మలబద్ధకం సమస్య లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి