Vitamin-D: వర్షాకాలంలో ఎండ రాదు కదా.. మరి విటమిన్ డిని ఎలా తీసుకోవాలి!!
మనకు అవసరమయ్యే విటమిన్స్ లలో విటమిన్ డి కూడా ఒకటి. ఈ విటమిన్ శరీరంలో ముఖ్యమైన పనులను చేస్తూ ఉంటుంది. నరాలను, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో, ముఖ్యంగా ఎముకలు దృఢంగా, ఎముకలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన బాడీలో విటమిన్ డి సరైన మోతాదులో ఉంచాలి లేదంటో అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు. ఉదయాన్నే ఎండలో ఉండటం లేదా ఇంటి..
మనకు అవసరమయ్యే విటమిన్స్ లలో విటమిన్ డి కూడా ఒకటి. ఈ విటమిన్ శరీరంలో ముఖ్యమైన పనులను చేస్తూ ఉంటుంది. నరాలను, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో, ముఖ్యంగా ఎముకలు దృఢంగా, ఎముకలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన బాడీలో విటమిన్ డి సరైన మోతాదులో ఉంచాలి లేదంటో అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు. ఉదయాన్నే ఎండలో ఉండటం లేదా ఇంటి పనులు చేయడం వల్ల మనకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది.
అయితే ప్రస్తుతం ఇప్పుడున్న వర్షా కాలంలో మాత్రం సూర్య రశ్మి రాదు. అసలు ఎండనే పడదు. దీంతో సూర్యరశ్మి.. మన శరీరంపై నేరుగా పడదు. దీంతో మనకు విటమిన్ డి లోపం తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయాలంటే వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. సాధారణంగా వయసును బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిరోజూ 10 నుంచి 20 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం అవుతుంది. కాబట్టి రెయినీ సీజన్ లో విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
పాలు, గుడ్లు, చేపలు, నారింజ పండ్లు, తృణ ధాన్యాలు, పుట్ట గొడుగులు (మష్రూమ్) వంటివి తీసుకుంటూ ఉండాలి. ఒక వేళ ఈ ఆహార పదార్థాలు తీసుకోని వారు.. విటిమిన్ డీ లోపం తలెత్తకుండా.. సప్లిమెంట్స్ తీసుకోవాలి. అయితే చాలా మంది అవసరం లేకపోయినా కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇది ప్రమాదానికి దారి తీయవచ్చు.
ఎందుకంటే విటమిన్ డి ఎక్కవైనా కూడా బాడీలో పలు వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాడీలో విటమిన్ డి ఎక్కువగా ఉంటే.. విరోచనాలు, బలహీనంత, వికారం, వాంతులు, కిడ్నీలో రాళ్లు పడటం, మూత్ర విసర్జన వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. విటమిన్ డి మోతాదు శరీరంలో ఎక్కువగా లేదా తక్కువగా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. బ్లడ్ టెస్టులు చేసుకోవాలి. దీంతో అవసరమైనతే వైద్యుల్ని సంప్రదించి తీసుకోవడం మేలు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి