Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth Cavity: పిప్పి పన్ను సమస్యతో నరకం చూస్తున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కా పాటించండి!!

చాలా మంది పిప్పి పన్ను సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వస్తే నరకం చూసినట్టే అనిపిస్తుంది. చిన్న సమస్యే అయినా.. దీని పోటు వర్ణనాతీతం. దేని మీదా ధ్యాస పెట్టలేము.. ఏ పనీ చేయలేము.. ఏమీ తినడానికి ఉండదు. చిన్న వారికైనా, పెద్ద వారికైనా ఈ సమస్య వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ సమస్య తలెత్తడానికి ముఖ్య కారణం.. నోటిలోని చెడు బ్యాక్టీరియా. మనం తీసుకునే ఆహారంలోనే చెడు బ్యాక్టీరియా.. పెరిగేలా సహాయపడుతుంది. అంతేకాకుండా వేడి వేడి పదార్థాలను..

Teeth Cavity: పిప్పి పన్ను సమస్యతో నరకం చూస్తున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కా పాటించండి!!
Mouth Care
Follow us
Chinni Enni

|

Updated on: Sep 05, 2023 | 6:39 PM

చాలా మంది పిప్పి పన్ను సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వస్తే నరకం చూసినట్టే అనిపిస్తుంది. చిన్న సమస్యే అయినా.. దీని పోటు వర్ణనాతీతం. దేని మీదా ధ్యాస పెట్టలేము.. ఏ పనీ చేయలేము.. ఏమీ తినడానికి ఉండదు. చిన్న వారికైనా, పెద్ద వారికైనా ఈ సమస్య వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ సమస్య తలెత్తడానికి ముఖ్య కారణం.. నోటిలోని చెడు బ్యాక్టీరియా. మనం తీసుకునే ఆహారంలోనే చెడు బ్యాక్టీరియా.. పెరిగేలా సహాయపడుతుంది. అంతేకాకుండా వేడి వేడి పదార్థాలను, పానీయాలను తాగినా, శీతల పానీయాలను పళ్లు సెన్సిటివిటీకి గురవుతాయి.

కొంతమంది అదే పనిగా కాఫీలు, టీలు తాగుతారు. మరికొంత మంది ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీంతో తినే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా లేకపోయినా కూడా దంతాలు పుచ్చిపోవడానికి ఒక కారణం అవుతుంది. పిప్పి పన్ను నొప్పి రాగానే చాలా మంది.. వెంటనే ట్యాబ్లెట్లు తెప్పించుకుని వేసుకుంటారు. లేదంటే డాక్టర్ల వద్దకు పరుగులు పెడతారు. ఇలా చేసే కంటే.. మొదట ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటించి చూస్తే సరిపోతుంది. లేదంటే అప్పుడు వైద్యుల్ని సంప్రదించడం మేలు.

బత్తాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇవి కూడా చదవండి

తొనలను నమిటి తినాలి: బత్తాయి పండు పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. బత్తాయి జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.. బత్తాయి తొనలను తినాలి. బత్తాయిలో నోట్లో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను తొలగించి, దంతాలు పుచ్చిపోకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

దంతాలపై గారను ఈజీగా తొలగిస్తుంది:

బత్తాయిలో ఉండే ఫైబర్ దంతాలపై ఉండే గారను కూడా తొలిగిస్తుంది. ఈ పండు తొనలను నమిలి తినడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గారను ఈజీగా తొలగించుకోవచ్చు.

చెడు బ్యాక్టీరియా నశిస్తుంది:

నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోరు ఫ్రెష్ గా క్లీన్ గా ఉన్న భావన కలుగుతుంది. అలాగే నోరు కూడా శుభ్రపడుతుంది.

నోరు దుర్వాసన రాదు:

బత్తాయి తొనలను నమిలి తినడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన సమస్యలు రావు.

జీర్ణ శక్తి మెరుగు పడుతుంది:

బత్తాయి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో ప్రేగులు శుభ్ర పడతాయి. దీంతో మల బద్ధకం సమస్య కూడా ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి