Kitchen Hacks: పెరుగును ఇలా తోడు పెట్టండి.. పుల్లగా లేకుండా తియ్యగా ఉంటుంది!!

ఆహారంలో ఒక భాగం పెరుగు. ఇది లేకుండా భోజనం కంప్లీట్ కాదు. మరికొంత మంది మజ్జిగగా కూడా తీసుకుంటారు. ఎలా తీసుకున్నా దీని ప్రయోజనాలు మాత్రం అద్భుతం. బాడీని చల్లబరిచే గుణం పెరుగులో ఉంది. అందుకే వేడి చేసింది అనగానే పెరుగను.. మజ్జిగగా చేసుకుని తాగుతూంటారు. మరి కొంత మంది లస్సీగా తీసుకొంటారు. ఇంకొంత మంది పెరుగులో పంచదార కలుపుకుని తింటారు. పెరుగులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగును క్రమం తప్పకుండా తింటూ ఉంటే..

Kitchen Hacks: పెరుగును ఇలా తోడు పెట్టండి.. పుల్లగా లేకుండా తియ్యగా ఉంటుంది!!
Yogurt Benefits
Follow us

|

Updated on: Sep 05, 2023 | 4:45 PM

ఆహారంలో ఒక భాగం పెరుగు. ఇది లేకుండా భోజనం కంప్లీట్ కాదు. మరికొంత మంది మజ్జిగగా కూడా తీసుకుంటారు. ఎలా తీసుకున్నా దీని ప్రయోజనాలు మాత్రం అద్భుతం. బాడీని చల్లబరిచే గుణం పెరుగులో ఉంది. అందుకే వేడి చేసింది అనగానే పెరుగను.. మజ్జిగగా చేసుకుని తాగుతూంటారు. మరి కొంత మంది లస్సీగా తీసుకొంటారు. ఇంకొంత మంది పెరుగులో పంచదార కలుపుకుని తింటారు. పెరుగులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగును క్రమం తప్పకుండా తింటూ ఉంటే మంచి బ్యాక్టీరియా శాతం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. పెరుగుతో చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు వంటివి మన దరి చేరకుండా చూస్తుంది పెరుగు. పెరుగుతో ఒక్కటేంటి.. చాలా అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

ఇలా పెరుగుతో అనేక రకాల ఉపయోగాలే ఉన్నాయి. ఇప్పటికే వాటి గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. అయితే అప్పుడప్పుడు పెరుగు పులుసు పోతూ ఉంటుంది. పులుసిన పెరుగును తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ పులిసిన పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. పులిసిన పెరుగులోనే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందట. ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. కొంత మంది పులిసిన పెరుగును ఇష్టపడరు. కానీ ఒక చిన్న చిట్కా వాడటం వల్ల పెరుగు పులవదు. ఇది చాలా ఈజీ కూడా. మరి అదేంటో తెలుసుకుందాం.

పెరుగు పులవకుండా ఉండేందుకు తేనె బాగా హెల్ప్ చేస్తుంది. మనం పాలు తోడివేసేటప్పుడు అందులో కాస్త తేనెను వేసి కలపాలి. అర లీటర్ పాలల్లో రెండు స్పూన్ల తేనె సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పెరుగు పులిసినా.. తియ్యగా ఉంటుంది. దీంతో అందులోని పోషకాలు కూడా పోవు. కాబట్టి ఈసారి పెరుగు పులవకుండా ఉండేందుకు ఈ చిట్కా వాడి చూడండి. అయితే పెరుగును ఎప్పుడైనా సరే.. మట్టి పిడతలో తోడి వేస్తే.. శరీరానికి మరింత మేలు కలుగుతుంది. మట్టి పాత్రల్లో వండిన వంటలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP News: ఆ విషయంలో ఏపీకి ఆదర్శంగా ఈశాన్య రాష్ట్రం..
AP News: ఆ విషయంలో ఏపీకి ఆదర్శంగా ఈశాన్య రాష్ట్రం..
'వెట్టైయాన్' సినిమాకు రజినీ, అమితాబ్ పారితోషికం ఏంతంటే..
'వెట్టైయాన్' సినిమాకు రజినీ, అమితాబ్ పారితోషికం ఏంతంటే..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
ఏడాదిలో నవరాత్రి 9 రోజులే తెరచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడంటే
ఏడాదిలో నవరాత్రి 9 రోజులే తెరచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడంటే
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఫొటోస్ వైరల్
మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఫొటోస్ వైరల్
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!