AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Ice: ముఖానికి ఐస్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అప్పుడు మీరు మొటిమలు, నల్లటి వలయాలు వంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది తమ చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొందరికి మాత్రం ఆశించిన ఫలితాలు రాక అసంతృప్తికి గురవుతుంటారు. అందుకే ఇప్పుడు మనం అలాంటి ఒక హోం రెమెడీ గురించి తెలుసుకుందాం. ఇది మీ చర్మాన్ని తాజాగా ..

Face Ice: ముఖానికి ఐస్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి
Face Ice
Subhash Goud
|

Updated on: Sep 05, 2023 | 6:27 PM

Share

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. వారి చర్మం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, మెరుస్తూ ఉండాలి. కానీ చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అప్పుడు మీరు మొటిమలు, నల్లటి వలయాలు వంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది తమ చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొందరికి మాత్రం ఆశించిన ఫలితాలు రాక అసంతృప్తికి గురవుతుంటారు. అందుకే ఇప్పుడు మనం అలాంటి ఒక హోం రెమెడీ గురించి తెలుసుకుందాం. ఇది మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

మీరు మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయాలని, చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటే మీరు ఐస్‌ను ఉపయోగించడం చాలా మందిని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐస్ బాత్ ట్రెండ్ నడుస్తోంది. ఐస్‌తో ముఖాన్ని మసాజ్ చేసి, ఐస్ బాత్ చేసిన తర్వాత, అది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఐస్ బాత్‌ను చాలా మంది సెలబ్రిటీలు కూడా అనుసరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం ఫేస్ ఐసింగ్ ఎలా చేయాలి..? అది చేసిన తర్వాత కలిగే ప్రయోజనాలను ఏమిటో తెలుసుకుందాం.

ఫేస్ ఐసింగ్ ఎలా చేయాలి?

ఫేస్ ఐసింగ్ చేసేటప్పుడు మీరు మీ ముఖానికి నేరుగా ఐస్‌ను అప్లై చేయవచ్చు లేదా మీరు మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగవచ్చు. అలాగే, ముఖానికి ఐసింగ్ చేసేటప్పుడు తులసి, పుదీనా లేదా ఇతర మూలికల ఐస్ క్యూబ్‌లను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ముఖానికి ప్రయోజనాలు

  1. ఫ్రెష్‌గా ఫీల్ అవ్వండి – ఒక నిమిషం పాటు మీ ముఖాన్ని ఐస్‌తో మసాజ్ చేయండి. ఇది మీకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మీ చర్మం కూడా పునరుజ్జీవింపబడుతుంది. మీ చర్మంలో తాజాదనం కావాలంటే, ఫేస్ ఐసింగ్ చేయండి.
  2. రక్త ప్రసరణలో ప్రయోజనాలు – నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్రమం తప్పకుండా ముఖంపై మంచు మసాజ్ చేయడం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఐస్‌తో మసాజ్ చేసిన తర్వాత, రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే మీ ముఖం తాజాగా కనిపిస్తుంది.
  3. ముఖ వాపును తగ్గిస్తుంది – ముఖం మీద వాపు లేదా ఉబ్బినట్లు ఉన్న చాలా మంది వ్యక్తులు క్రమం తప్పకుండా ఫేస్ ఐసింగ్ చేయాలి. ఎందుకంటే ఫేస్ ఐసింగ్ ముఖం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖం లోపల రక్తనాళాలలో వాపును తగ్గించడంలో ఐస్ సహాయపడుతుంది.