Tomato: టమాటాతో ఇలా చేయండి.. తక్కువ సమయంలోనే బ్లాక్ హెడ్స్ పోతాయి!!
చాలా మంది ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముక్కు, బుగ్గలు, కంటి కింద భాగం, నుదురు, గడ్డం వంటి భాగాల్లో ఈ బ్లాక్ హెడ్స్ వస్తూంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరింత వేధిస్తుంది. చర్మంపై డస్ట్, మురికి, మృత కణాలు పేరుకుపోతాయి. వీటిని ముఖంపై సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే.. బ్లాక్ హెడ్స్ లా తయారవుతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల ఎలాంటి హాని జరగదు కానీ.. వీటి వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అయితే వీటిని తొలగించుకోవడానికి..
చాలా మంది ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముక్కు, బుగ్గలు, కంటి కింద భాగం, నుదురు, గడ్డం వంటి భాగాల్లో ఈ బ్లాక్ హెడ్స్ వస్తూంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరింత వేధిస్తుంది. చర్మంపై డస్ట్, మురికి, మృత కణాలు పేరుకుపోతాయి. వీటిని ముఖంపై సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే.. బ్లాక్ హెడ్స్ లా తయారవుతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల ఎలాంటి హాని జరగదు కానీ.. వీటి వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అయితే వీటిని తొలగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
దీంతో బ్యూటీ పార్లర్ లకు క్యూ కడుతూ ఉంటారు. స్ర్కబర్, ఫేస్ క్లీన్ అప్, స్ట్రిప్స్ వంటివి చేయించుకుంటారు. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. ఈజీగా బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవచ్చు. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. బ్లాక్ హెడ్స్ తొలగించుకునేందుకు ఈ చిట్కా మీకు బాగా హెల్ప్ చేస్తుంది. కేవలం తక్కువ పదార్థాలతో.. తక్కువ సమయంలోనే బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవచ్చు. మరి అవేంటి? వాటితో ఎలా బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్క్రబ్ కి కవాల్సిన పదార్థాలు:
టమాటా, పంచదార
ఎలా ఉపయోగించాలి:
ఒక టమాటాను అడ్డంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓ చిన్న గిన్నెలో ఒక స్పూన్ పంచదారను తీసుకోండి. ఇప్పుడు ఆ టమాటా ముక్కను పంచదారలో అద్ది బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దాలి. ఇలా నిమిషం పాటు చేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. నెక్ట్స్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఓ సారి చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. అలాగే ఫేస్ కూడా అందంగా కనిపిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి