Health Tips: టమోటాలను తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త, పరిమితి దాటితే ఈ సమస్యలతో బాధపడక తప్పదు..
Tomato Side Effects: టమాటాల్లోని కాల్షియం ఎముకలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం అయితే రక్తపోటును నియంత్రించి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే టమోటాలను అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పరిమితికి మంచి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా, సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.
Tomato Side Effects: టమాటాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి, వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చు. టమోటాల్లోని విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని విటమిన్ ఇ కేశ సమస్యలు, చర్మ సమస్యలను దూరం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కాల్షియం ఎముకలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం అయితే రక్తపోటును నియంత్రించి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే టమోటాలను అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పరిమితికి మంచి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా, సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఇంతకీ టమాటాలను అతిగా తీసుకుంటే ఏయే సమస్యలు ఎదురవుతాయో మీకు తెలుసా..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టమోటాలు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు:
జీర్ణ సమస్యలు: టమోటాలను అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెబు ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో మీరు కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధింత సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఇవే కాక పేగులపై కూడా ఒత్తిడి పెరిగి తీవ్ర సమస్యలకు కారణంం అవుతుంది. ఈ కారణంగా టమాటాలను పరిమితిగా తీసుకోవడానికే ప్రయత్నించండి.
అలర్జీ సమస్య: టమోటాలోని హిస్టమిన్ సమ్మేళనం చాలా మందిలో అలర్జీ సమస్యను కలిగిస్తుంది. ఇంకా దగ్గు, తుమ్ములు, గొంతు మంట, ముఖం వాపు, నాలుక వాపు వంటి లక్షణాలను చూపిస్తుంది.
కిడ్నీ స్టోన్స్: టమోటాల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా టమోటాలును పరిమితికి మించి తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
చర్మ సమస్యలు: టమాటాలోని పోషకాలు చర్మ సమస్యలను దూరం చేయడానికి, ముఖం మెరిసేలా చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి. అయితే పరిమితికి మించి టమోటాలను తీసుకుంటే అవే సమస్యలు మళ్లీ తప్పవు. టమాటాల్లోని లైకోపిన్ చర్మం రంగు మారడంతో పాటు అలర్జీ సమస్యలు పెరుగుతాయి.
కీళ్ల నొప్పులు: టమోటాలు ఆరోగ్యానికి ప్రయోజనకరమైన కూరగాయలే అయినప్పటికీ పరిమితి దాటితే సమస్యలు తప్పవు. ఎందుకంటే టమాటాల్లోని సోలోనిన్ అనే పదార్థం కీళ్ల నొప్పులను పెంచుతుంది. ఈ కారణంగా టమాటాలను పరిమితిగానే తీసుకునే ప్రయత్నం చేయండి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..