AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అల్పాహారం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ ఆరోగ్యాం పాడైపోతుంది..

Breakfast Mistakes: రోజు ప్రారంభమే.. రోజు మొత్తం ఎలా ఉండనుందో నిర్ణయిస్తుంది. ఉదయం బాగుంటే రోజంతా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇది వర్తిస్తుంది. అందులోనూ అల్పాహారం విషయంలో తప్పకుండా పాటించాల్సిన అంశాలు ఉన్నాయి. అల్పాహారం ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. రోజంతా పని చేయడానికి శరీరానికి తగినంత శక్తి అవసరమైనప్పుడు,

Health Tips: అల్పాహారం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ ఆరోగ్యాం పాడైపోతుంది..
Breakfast Tips
Shiva Prajapati
|

Updated on: Sep 05, 2023 | 8:45 AM

Share

Breakfast Mistakes: రోజు ప్రారంభమే.. రోజు మొత్తం ఎలా ఉండనుందో నిర్ణయిస్తుంది. ఉదయం బాగుంటే రోజంతా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇది వర్తిస్తుంది. అందులోనూ అల్పాహారం విషయంలో తప్పకుండా పాటించాల్సిన అంశాలు ఉన్నాయి. అల్పాహారం ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. రోజంతా పని చేయడానికి శరీరానికి తగినంత శక్తి అవసరమైనప్పుడు, సరైన అల్పాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొందరు అల్పాహారం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తినకూడని విషయాలు తెలుసుకుందాం.

ఉదయాన్నే కాఫీ తాగొద్దు..

చాలా మంది ఉదయం లేవగానే బెడ్ టీ, కాఫీ తాగుతుంటారు. ఇది తప్పుడు అలవాటు. ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే, మీ శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. దాని కారణంగా అనారోగ్యానికి గురవుతారు. అంతే కాకుండా ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

ఉదయం పూట పండ్ల రసానికి దూరంగా ఉండండి..

ఉదయం పూట ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగకూడదు. పగటిపూట తాజా పండ్ల రసాన్ని తీసుకోవచ్చు. కానీ ఉదయం ఖాళీ కడుపుతో పండ్ల రసాన్ని తాగకూడదు. ఇది మీ శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మీరు తాగాలనుకుంటే.. మీరు అల్పాహారం తర్వాత పండ్ల రసం తాగవచ్చు.

జంక్ ఫుడ్: కొంతమంది అల్పాహారం కోసం శాండ్‌విచ్‌లు వంటి జంక్ ఫుడ్స్ తింటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌ను తినొద్దు. శాండ్‌విచ్, పిజ్జా, బర్గర్, సాసేజ్ మొదలైన వాటిని తినడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. శరీరం కొవ్వు నిలయంగా మారుతుంది. అందుకే ఉదయాన్నే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు.

వైట్ బ్రెడ్..

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైట్ బ్రెడ్‌ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ఇది హానికరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి వైట్ బ్రెడ్ మైదా పిండితో తయారు చేస్తారట. దానిని అధిక తినడం వలన జీర్ణక్రియ పాడవుతుంది. ఇది కాకుండా, ఉదయం పరంగా ఇందులో పోషకాహారం చాలా తక్కువగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..