Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer: క్యాన్సర్‌ని నిరోధించడంలో ఈ పోషకాల పనితనం భేష్.. వీటి కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

Cancer: ప్రస్తుత కాలంలో గుండెపోటుతో పాటు క్యాన్సర్ సమస్య కూడా మానవ సమాజానికి మహమ్మారిగా పరిణమించింది. క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో క్యాన్సర్ సమస్యను ముందుగానే నిరోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసం మెరుగైన జీవనశైలి, ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ మేరకు అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే మానవ శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో పోషకాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతకీ క్యాన్సర్‌ని నిరోధించేందుకు ఏయే పోషకాలు అవసరం, వాటి కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 05, 2023 | 8:09 AM

విటమిన్ A: విటమిన్ ఎ ట్యూమర్ సెల్స్ పెరుగుదలను నియంత్రించడంలో మెరుగ్గా ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ మాత్రమే ఇతర దీర్ఘకాలిక సమస్యల అభివృద్ధిని నిరోధించడంలో కూడా విటమిన్ ఎ సహాయపడుతుంది. విటమిన్ ఎ కోసం క్యారెట్, బ్రొకలీ, కొత్తిమీర, పెరుగు, చీజ్, నారింజ, గుడ్డు, ఎండు ఖర్జూలను తీసుకోవచ్చు. 

1 / 5
విటమిన్ C: శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి, సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. పైగా దీనికి క్యాన్సర్‌ కణాలను విచ్ఛిన్నం చేయగల శక్తి కూడా ఉందని అధ్యయనాలు నిరూపించాడు. ఈ క్రమంలో మీరు విటమిన్ సి కోసం వాల్నట్స్, సిట్రస్ పండ్లు, అరటి, కీవీ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఖర్జూర వంటి వాటిని తీసుకోవాలి. 

2 / 5
విటమిన్ D: ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగకరంగా ఉండే విటమిన్ డి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పలు అధ్యయనాల ప్రకారం విటమిన్ డి అనేక రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షిస్తుంది. చీజ్, లివర్, పుట్టగొడుగులు, గుడ్లు, పైనాపిల్, పచ్చి బఠానీలు, పెరుగు, కరివేపాకు, చేపలు వంటి ఆహారాల్లో విటమిన్ డి లభిస్తుంది. 

3 / 5
విటమిన్ E: విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్‌కి కారణమయ్యే శరీరంలోని ఫ్రీరాడికల్స్‌‌ని నిరోధించడంతో విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ లభించే బాదం, కీవీ, క్యాప్సికమ్, దుంపలు, ఆకుకూరలు, బ్రొకలీ, బొప్పాయి, టమోటా, అవకాడో, రొయ్యలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్‌ సమస్యలను నిరోధించవచ్చు.

4 / 5
విటమిన్ K: విటమిన్ కె రక్తం గడ్డకట్టే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ కె క్యాన్సర్ నిరోధక గుణాలను కలిగి ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ కె క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంతో పాటు వాటిని విచ్ఛిన్నం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో విటమిన్ కె కోసం మీరు కూరగాయలు, పాలకూరలు, అవకాడో, ఆపిల్, బ్రొకలీ, కీవీ, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవచ్చు.

5 / 5
Follow us