బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్యే బిగ్ షాక్..? రాజనర్సింహాతో రాజయ్య భేటీ.. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లేనా..?

Telangana Politics: కాంగ్రెస్‌కు రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరిగుతుందా..? కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే రెడీ అవుతున్నారా..?. తాజాగా దళిత మేధావుల సదస్సులో దామోదర రాజనరసింహతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు..? బీఆర్ఎస్ కు ఆ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్తారా..?

బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్యే బిగ్ షాక్..? రాజనర్సింహాతో రాజయ్య భేటీ.. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లేనా..?
MLA Rajayya; Damodara Raja Narasimha
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 05, 2023 | 8:07 AM

తెలంగాణ, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో స్టేషన్‌ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో ఇప్పటికే పలు వేదికలుగా కన్నీటి పర్యాంతమయ్యారు రాజయ్య. అనుచరులు, కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు. హనుమకొండ నయీమ్ నగర్‌లోని ఓ హోటల్లో ఇద్దరు నేతలు కలిశారు. తెలంగాణలోని తాజా రాజకీయాల పరిస్థితులపై చర్చలు జరిపారు. ఇదే టైమ్‌లో పార్టీలో చేరిక, టికెట్‌పై మాట్లాడినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. అయితే హనుమకొండలో దళిత మేధావుల సదస్సు నిర్వహించేందుకు దామోదర రాజనర్సింహ అక్కడకు వెళ్లారు. ఇదే సదస్సుకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతతో రాజయ్య కలిసి మాట్లాడడంతో.. కాంగ్రెస్ చేరడం లాంఛనమేననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం లేకపోలేదంటున్నారు.

అయితే బీఆర్ఎస్‌లో సీటు దక్కన ఆశావాహులంతా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పంచనా చేరుతున్నారు. రీసెంట్‌గా ఖమ్మం కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం త్వరలోనే కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే బాటలో రాజయ్య కూడా పయనిస్తారని.. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులతో పలు దఫాలు భేటీ నిర్వహించి వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారనే టాక్ ఉంది. కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలకు రాజయ్య చెక్ పెడతారో..? లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..