Asaduddin Owaisi: తెలంగాణ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి.. ఆ రోజున అందరూ శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ ..

Hyderabad: రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలను సెప్టెంబర్ 28న జరుపుకుంటామని, ఆ సమయంలో అందరూ శాంతిభద్రతలను కాపాడుకోవడం తప్పనిసరి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు చూస్తున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వరని తనకు తెలుసని ఓవైసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గురించి ఒవైసీ మాట్లాడుతూ..

Asaduddin Owaisi: తెలంగాణ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి.. ఆ రోజున అందరూ శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ ..
Asaduddin Owaisi
Follow us
Noor Mohammed Shaik

| Edited By: TV9 Telugu

Updated on: Sep 11, 2023 | 4:49 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణలో మిలాద్ ఉన్ నబీ వేడుకల సమయంలో అందరూ శాంతిభద్రతలు కాపాడుకోవాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(మజ్లీస్ పార్టీ) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 28న రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలను జరుపుకుంటామని, ఆ సమయంలో అందరూ శాంతిభద్రతలను కాపాడుకోవడం తప్పనిసరి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు చూస్తున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వరని తనకు తెలుసని ఓవైసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గురించి ఒవైసీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి భంగం కలగని విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అంతకుముందు, సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (SUFI) ప్రతి సంవత్సరం రబీ ఉల్ అవ్వల్ 12వ రోజున నిర్వహించుకునే వార్షిక మిలాద్ ఉన్ నబీ ర్యాలీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తెలిపింది.

కాగా, తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ నాడు సెలవు ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం గణేష్ చతుర్థీ కోసం ప్రకటించిన సెలవు దినాల్లోనే మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా వచ్చింది. ఇంకా పోర్టల్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో 6వ తేదీన అర్బయీన్, 7న శ్రీ కృష్ణ అష్టమి అలాగే 18న వినాయక చతుర్థి, 28న  మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్నాయి.

నగర శాంతి కమిటీ సభ్యులతో సీపీ సీవీ ఆనంద్‌..

హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులకు శాంతి కమిటీ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని, సెంట్రల్ పీస్ కమిటీకి చెందిన 500 మంది సభ్యులతో నిర్వహించిన సమావేశంలో నగర పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని టీఎస్‌‌పీఐసీసీసీ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాట్‌ ఫామ్‌లో జరిగే దుష్ప్రచారరాల వ్యాప్తిని నిరోధించే విధంగా పీస్ కమిటీలోని ఐటీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగ, ఊరేగింపుల సమయంలో తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉందని, వాటిపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పి్స్తూ పీస్ కమిటీ సభ్యులు పనిచేయాలని ఆయన కోరారు. సమాజంలోని 0.1 శాతం మంది మాత్రమే శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నాలు చేస్తుంటారని, వారిని అందరూ కలిసి ఎదుర్కోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.