Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముందు ట్రైనింగ్‌ అన్నారు, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అన్నారు.. తీరా చూస్తే

కష్టపడకుండా ఉద్యోగం పొందాలి, తొందరగా ఎక్కువ జీతం పొందాలనుకునే వారి ఆశను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే సంఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు వసులూ చేయడం, తీరా డబ్బులు తీసుకున్నాక మోసం చేయడం ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో...

Hyderabad: ముందు ట్రైనింగ్‌ అన్నారు, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అన్నారు.. తీరా చూస్తే
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 04, 2023 | 9:09 AM

ప్రజల అవసరాలను, అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని జరుగుతోన్న నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కష్టపడకుండా ఉద్యోగం పొందాలి, తొందరగా ఎక్కువ జీతం పొందాలనుకునే వారి ఆశను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే సంఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు వసులూ చేయడం, తీరా డబ్బులు తీసుకున్నాక మోసం చేయడం ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో ఓ కేటుగాడు నిరుద్యోగాలను నిండా ముంచాడు. శిక్షణతో పాటు ఉద్యోగం ఇస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రద్‌లోని కడప జిల్లాకు చెంది బిజినేపల్లి ప్రేమ్‌ ప్రకాష్‌ (44) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. సనత్‌ నగర్‌లో ఉంటూ లిఖిత్ అనే ఓ స్నేహితుడితో కలిసి ఏడాది క్రితం నగరంలోని కొండాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు.

పెరల్‌ భవనంలో సంటూ సూ ఇన్నోవేషన్స్‌ పేరుతో ఓ చిన్న కంపెనీనీ ప్రారంభించాడు. అనంతరం సంస్థలో శిక్షణ ఇచ్చి అనంతరం ఐటీ ఉద్యోగం కల్పిస్తామని కొందరు నిరుద్యోగులను నమ్మించడం ప్రారంభించాడు. ఇలా ఒక్కో వ్యక్తి నుంచి రూ. లక్ష నుంచి రెండు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. తొలుత కొన్ని నెలలు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉద్యోగం ఇచ్చినట్లు నమ్మబలికి రెండు నెలలు జీతం సైతం ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాయమాటలు చెబుతూ నెట్టుకొచ్చారు. జీతం ఇవ్వడం ఆపేశారు.

దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. జీతాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. అయితే ప్రతినిధులు మాత్రం దీనికి సమాధానం దాట వేస్తూ వచ్చారు. దీంతో విసిగిపోయిన అభ్యర్థులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రేమ ప్రకాష్‌, లిఖిత్‌లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిందితులు ఉద్యోగాల పేరుతో రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..