రోజుకో తమలపాకు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెటొచ్చు..!

ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న మలబద్ధకంతో సహా వివిధ సమస్యల నుండి తమలపాకులు రక్షిస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉన్నవారు, మలబద్ధకం సమస్య ఉన్నవారు తమలపాకులను తీసుకుంటే తప్పకుండా ఈ సమస్యలు తొలగిపోతాయి.

రోజుకో తమలపాకు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెటొచ్చు..!
Betel Leaves
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 05, 2023 | 3:24 PM

మన దేశంలో తమలపాకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆకులకు పూజాది కార్యక్రమాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక చాలా మంది పాన్‌ రూపంలో ప్రతి రోజూ తింటుంటారు. తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకును ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. తమలపాకుల్లో విటమిన్ సి, కాల్షియం రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. తమలపాకు.. ఎన్నో రకాల వ్యాధులు, రుగ్మతలకు ఔషధంగా ఉపయోగిస్తారు. తమలపాకులు నమలడం లేదా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తమలపాకు ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొనే మలబద్ధకంతో సహా అనేక సమస్యల నుండి రక్షిస్తుంది. సాధారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యను లైట్‌ తీసుకుంటారు. కానీ, ఇది ఇతర అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని తెలుసుకోరు. పరిస్థితి మరింత దిగజారితే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. శరీరంలోని వివిధ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎక్కువగా ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, పదార్థాలలో లభిస్తుంది. తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న మలబద్ధకంతో సహా వివిధ సమస్యల నుండి తమలపాకులు రక్షిస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉన్నవారు, మలబద్ధకం సమస్య ఉన్నవారు తమలపాకులను తీసుకుంటే తప్పకుండా ఈ సమస్యలు తొలగిపోతాయి. రోజూ 1-2 తమలపాకులు నమలడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణశక్తి బాగుంటే.. మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. ఎందుకంటే ఆధునిక జీవనశైలిలో మలబద్ధకం ఎక్కువగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్ , ఆయిల్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇవి అజీర్ణం, తేలికపాటి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి తమలపాకులు అద్భుతాలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. తమలపాకుని సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా పరిగణిస్తారు. తమలపాకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.  అంతేకాదు.. దంతాల్లో క్యావిటీస్‌, దంతక్షయాన్ని అరికట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మీ నోటి దుర్వాసనను తొలగిస్తాయి. దగ్గు, జలుబుకు సంబంధిత సమస్యల చికిత్సకు కూడా తమలపాకును ఉపయోగిస్తారు. ఛాతీలో కఫం, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా బాధితులకు తమలపాకు అద్భుతమైన నివారణిగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..