Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra pradesh: నల్లమలలో హల్‌చల్‌ చేసిన వింత జీవి.. ప్రపంచంలోనే అరుదైన జంతువు..?

అడవిలో వీటి దారి రహదారి... బెటర్‌, డోంట్‌ కం ఇన్‌ మై వే అన్నట్టుగా రాజసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి... అడ్డొస్తే ఇక అంతే సంగతులు... అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడుతుంది... పాముల విషం కూడా వీటిని ఏమీ చేయలేదట... ఇలాంటి జంతువు ఇటీవల కాలంలో నల్లమలలో పులుల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో రికార్డైనట్టుగా అధికారులు తెలిపారు.

Andhra pradesh: నల్లమలలో హల్‌చల్‌ చేసిన వింత జీవి.. ప్రపంచంలోనే అరుదైన జంతువు..?
Rare Animal
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 05, 2023 | 1:48 PM

ఒంగోలు, సెప్టెంబర్05: ఆ కళ్ళల్లో భయం లేదు… ఒంట్లో బెదరు లేదు… భయం అనే పదానికి ఆ జీవి డిక్షనరీలో చోటు లేదు… అది చూడటానికి పెద్ద ముంగిసలా కనిపిస్తుంది… పెద్దపులినైనా మట్టికరిపిస్తుంది… నల్లమల అడవుల్లో పులిపైన సైతం దాడిచేయగల అరుదైన జంతువు అది… దాని పేరే హనీ బ్యాడ్జర్… అలాగని దీని ఆకారం ఆకాశమంత ఉంటుంనుకుంటే పొరపాటే… కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది… పొట్టిదైనా గట్టి పిండం… ప్రకాశంజిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఈ అరుదైన జంతువు ఇటీవల సంచరిస్తున్నట్టు పారెస్ట్ అధికారులు గుర్తించారు… దోర్నాల పరిధిలో విస్తరించిన ఈ నల్లమల అడవుల్లో ఎక్కువగా సంచరించే పులులకు కూడా ఈ హనీ బ్యాడ్జర్‌ అంటే హడలే… హనీ బ్యాడ్జర్‌ మందమైన సాగే గుణం ఉన్న చర్మం కలిగి ఉంటుంది… పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి, ఆఖరికి ఏనుగు లాంటి జంతువులపై కూడా ధైర్యంగా పోరాడే తత్వం దీని సొంతం… ప్రపంచంలోనే భయం లేని జంతువు ఏదైనా ఉందంటే అది హనీ బ్యాడ్జరే…

అరుదైన జాతుల్లో హనీబ్యాడ్జర్‌ ఒకటి…

నల్లమలలో ఉన్న జీవజాతులు మరో అడవిలో కనిపించవు… అంత జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం నల్లమల… నల్లమలలో 55 జాతుల క్షీరదాలు, 54 రకాల సరీసృపాలు, 200 రకాల పక్షులు, 55 జాతుల చేపలు, 18 రకాల ఉభయచరాలు ఉన్నాయి… ఇక కీటక జాతికి కోదవే లేదు… మరోవైపు నల్లమల జింకలకు ప్రసిద్ధి… ఇక్కడ ఉన్న వివిధ రకాల జింకల్లో అతి చిన్నది మూషిక జింక… ఇలాంటి జీవవైవిధ్యం ఉన్న నల్లమలో ప్రపంచంలోనే అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే హనీ బ్యాడ్జర్‌ (తేనే కుక్క) కూడా ఉన్నట్టు ఇటీవల గుర్తించారు… దక్షిణాఫ్రికా అడవుల్లో మాత్రమే గుర్తించిన ఈ జీవులు ఇటీవల పాపికొండల్లో గుర్తించారు… అనంతరం ఇప్పుడు నల్లమల అడువుల్లో కూడా వీటి ఉనికి ఉన్నట్టు ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు…

ఇవి కూడా చదవండి

వీటిని చూస్తే హడలే…

హనీ బ్యాడ్జర్‌ వస్తుందంటే చాలు మిగిలిన జంతువులు హడలిపోతాయి… నక్కలు, తోడేళ్ళతో పాటు ఎలుగుబంట్లు, ఏనుగులు, పులులు సైతం దారిచ్చి తప్పుకుంటాయి… అడవిలో వీటి దారి రహదారి… బెటర్‌, డోంట్‌ కం ఇన్‌ మై వే అన్నట్టుగా రాజసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి… అడ్డొస్తే ఇక అంతే సంగతులు… అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడుతుంది… పాముల విషం కూడా వీటిని ఏమీ చేయలేదట… ఇలాంటి జంతువు ఇటీవల కాలంలో నల్లమలలో పులుల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో వీటి కదలికలు రికార్డు కావడంతో వీటి సంఖ్య గణీనీయంగా పెరుగుతున్నట్టు గుర్తించారు… దీని ఎత్తు కేవలం 12 అంగుళాలు… దాని పంజా గోళ్లు మూడు అంగుళాల పొడవు ఉంటాయి. బరువు సుమారు పది కిలోలు మాత్రమే ఉంటుంది.. చూసేందుకు ఎలుగుబంటికి జిరాక్స్ కాపీలా మరగుజ్జుగా ఉంటుంది. కానీ పౌరుషంలో దీనికి మరొక జంతువు సాటిరాదు. పులి ఎదురొచ్చినా వెనక్కి తగ్గదు… ఏది ఏమైనా పులులు, ఏనుగుల్లో హడలెత్తించే జంతువు హనీ బ్యాడ్జర్‌ అంటే అడవిరాజ్యంలో అందరికీ భయమే… పొట్టిదైనా గట్టిదే…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..