Kurnool District: కొండల రాయుడికి తేళ్ల నైవేద్యం.. కర్నూల్ జిల్లాలో వింత ఆచారం..
Kurnool District: కర్నూల్ జిల్లా, పరిసర ప్రాంత ప్రజలు తేళ్లను శరీర భాగాలపై పాకించుకుంటూ, కుట్టించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం మూడవ సోమవారంలో కర్నూల్ జిల్లాలోని కోడుమూరు కొండపై ఉన్న కొండల రాయుడికి తేళ్లతో నైవేద్యం పెడుతుంటారు. ఇలా తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో వారు తేళ్లను చేతులు, తల, ముఖం, చివరికి నాలుక పైన కూడా పెట్టుకుంటారు, అయితే ఈ ఒక్క రోజు వారికి ఏమీ కాదంట. ఒకవేళ తేళ్లు..
కర్నూల్ జిల్లా, సెప్టెంబర్: ఎంతటి ధైర్యవంతులైనా తేలు అంటే జంకుతారు. అయితే కర్నూల్ జిల్లా, పరిసర ప్రాంత ప్రజలు మాత్రం తేలును శరీర భాగాలపై పాకించుకుంటూ, కుట్టించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం మూడవ సోమవారంలో కర్నూల్ జిల్లాలోని కోడుమూరు కొండపై ఉన్న కొండల రాయుడికి తేళ్లతో నైవేద్యం పెడుతుంటారు. ఇలా తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో వారు తేళ్లను చేతులు, తల, ముఖం, చివరికి నాలుక పైన కూడా పెట్టుకుంటారు, అయితే ఈ ఒక్క రోజు వారికి ఏమీ కాదంట. ఒకవేళ తేళ్లు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు నొప్పి మటుమాయం అవుతుందని భక్తులు చెబుతున్నారు. అలాగే కొండల రాయుడికి పూజలు చేసే శ్రావణ సంలో మూడవ సోమవారం రోజు గానీ, ఆ తర్వాత లేదా ముందు రోజు గానీ వర్షాలు కురుస్తుంటాయిన భక్తులు విశేషంగా చెబుతున్నారు.
Published on: Sep 05, 2023 01:17 PM
వైరల్ వీడియోలు
Latest Videos