Big News Big Debate: ఇండియా అనగా భారత్‌.. పేరులో ఏముంది..!

Big News Big Debate: జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి వచ్చిన ఆహ్వానం ఇప్పుడు దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. సాధారణంగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన చోట... ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ కనిపించడంతో కాంగ్రెస్‌లో అనుమానాలు మొదలయ్యాయి.

Big News Big Debate: ఇండియా అనగా భారత్‌.. పేరులో ఏముంది..!
Big News Big Debate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 05, 2023 | 6:50 PM

Big News Big Debate: జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి వచ్చిన ఆహ్వానం ఇప్పుడు దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. సాధారణంగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన చోట… ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ కనిపించడంతో కాంగ్రెస్‌లో అనుమానాలు మొదలయ్యాయి. దేశం పేరు కూడా మారుస్తారా అంటూ కొందరు విమర్శలు చేస్తుంటే.. భారత్‌ మాతా కి జై అంటూ బీజేపీ నేతలు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.

వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్ పై దేశమంతా రచ్చ జరుగుతుండగానే ఇండియా- భారత్‌ పేర్లపై చర్చ మొదలైంది..

ఇంతకాలం ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానాలు ఉండేవి. అనూహ్యంగా జీ20 విందు ఆహ్వాన పత్రికల్లో మారింది. మన దేశం పేరును ఇండియా అని పిలవడం మానుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ ఓ సభలో చెప్పిన రెండు రోజులకే జీ-20 ఆహ్వాన పత్రాల్లో భారత్‌ అని రాయడం సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌గా రాశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత జైరాంరమేశ్‌. అటు విపక్ష కూటమికి భారత్‌ అని పేరు పెడితే అది కూడా మారుస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.

దేశ గౌరవానికి సంబంధించిన విషయంపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని విపక్షాలను ప్రశ్నించారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. భారత్‌జోడో యాత్ర చేసిన వాళ్లు భారత్‌ పేరుపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని నిలదీశారు. అటు భారత్‌గా మార్చడాన్ని బిగ్‌బి అమితాబ్‌ సమర్ధించారు. భారత్‌మాతాకీ జై అంటూ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.

అమృత్‌కాల్ సమయంలో దేశ ప్రజలను బానిస మనస్తత్వం నుండి విముక్తి చేయాలని నొక్కి చెబుతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం నుండి ఇండియా అనే పదాన్ని తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరు 18-22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ఇండియా పదాల తొలగింపు ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను సమర్పించే అవకాశం ఉందంటున్నాయి విపక్షాలు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..