Big News Big Debate: సెప్టెంబర్‌ 17 బిగ్‌ డే.. పార్టీలకు అస్త్రమా? సెంటిమెంట్‌తో ఎన్నికల ప్రచారం..!

Big News Big Debate: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మూడు ప్రధానపార్టీలు తలపడుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టిన పార్టీలు... అటు సెంటిమెంట్‌ను కూడా బలంగా రగిలించే ప్రయత్నాల్లో ఉన్నాయి పార్టీలు. సరిగ్గా ఎన్నికలకు మూడునెలల ముందు వస్తున్న సెప్టెంబర్‌ 17 పార్టీలకు ఓ ఆయుధంగా మారనుందా?

Big News Big Debate: సెప్టెంబర్‌ 17 బిగ్‌ డే.. పార్టీలకు అస్త్రమా? సెంటిమెంట్‌తో ఎన్నికల ప్రచారం..!
Big News Big Debate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 04, 2023 | 6:58 PM

Big News Big Debate: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మూడు ప్రధానపార్టీలు తలపడుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టిన పార్టీలు… అటు సెంటిమెంట్‌ను కూడా బలంగా రగిలించే ప్రయత్నాల్లో ఉన్నాయి పార్టీలు. సరిగ్గా ఎన్నికలకు మూడునెలల ముందు వస్తున్న సెప్టెంబర్‌ 17 పార్టీలకు ఓ ఆయుధంగా మారనుందా?

సెప్టెంబర్‌ 17.. తెలంగాణలో ఈ రోజుకున్న ప్రత్యేకతే వేరు.. ఉద్యమంలోనూ ఆ తర్వాత కూడా ప్రతి ఏటా వార్తల్లో ఉంటోంది. నిర్వహణపై భిన్నస్వరాలున్నాయి. అన్నిచూస్తే.. రాజకీయ పార్టీలకు ఇది బిగ్‌ డేనే..

గత సంవత్సరం ఎలా జరిగినా.. ఇప్పుడు ఎన్నికల ఏడాది.. అందుకే పార్టీలకు ఇదో వజ్రాయుధం. అందుకే కాంగ్రెస్‌ పక్కా స్కెచ్‌ వేసింది. 16న హైదరాబాద్‌లో వర్కింగ్‌ కమిటీ సమావేశాల షెడ్యూల్‌ ఫిక్స్ అయింది. ఇక్కడకు వచ్చిన నేతలంతా కూడా సెప్టెంబర్‌ 17 దినోత్సవంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీకి ప్లాన్‌ చేసింది పార్టీ. సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే సహా హైకమాండ్‌ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుంది. అంటే సెప్టెంబర్‌ 17న ఘనంగా నిర్వహించి మరోసారి ప్రజల్లో సెంటిమెంట్ రగలించబోతున్నారు. అంతేకాదు ఇదే వేదికగా తెలంగాణ ప్రజలకు ఎన్నికల హామీలు కూడా ఇవ్వబోతున్నారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది విమోచన దినోత్సవాన్ని కేంద్రం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ ఈ సారి కూడా అంతకంటే భారీగా ప్లాన్‌ చేస్తోంది. అమిత్‌షా సహా పలువురు అగ్రనేతలకు ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గత ఏడాది తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎన్నికల ముందు వచ్చిన బిగ్‌ డే ఎలా డీల్ చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది. మరి బిగ్‌ డే ఎవరికి కలిసివస్తుంది? ఎవరి ప్రణాళికులు ఎలా ఉండబోతున్నాయి. ఎన్నికలకు, విలీనాన్ని వేర్వేరుగా చూస్తారా? మిక్స్‌ చేసి ఓట్ల వేట సాగిస్తారా?

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..