Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Ageing Tips: మచ్చలేని, మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్ ప్యాక్.. ఇంట్లోనే ఇలా చేస్తే నిత్య యౌవనం మీ సొంతం..!

ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్‌లను కూడా అనేక విధాలుగా తగ్గిస్తుంది. వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ చర్మ కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తాయి. అలాగే, ఇది మెలనిన్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వేప ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కొన్ని వారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Anti Ageing Tips: మచ్చలేని, మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్ ప్యాక్.. ఇంట్లోనే ఇలా చేస్తే నిత్య యౌవనం మీ సొంతం..!
Neem Face Mask
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 05, 2023 | 12:13 PM

మీ అందమైన ముఖంపై నల్ల మచ్చలు, ముడతలు ఉన్నాయా..? ముఖంపై ముడతలు, నల్లమచ్చలను తొలగించుకునేందుకు క్లెన్సర్, ఫౌండేషన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? అవును అయితే చింతించకండి. మీ కోసమే ఇక్కడ ఒక ఉపయోగకరమైన ఫేస్ మాస్క్ గురించి చెప్పబోతున్నాం. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా మార్చేస్తుంది. ఇది రసాయన ఉత్పత్తుల ప్రభావాలను కూడా నివారిస్తుంది. దాదాపు ప్రతి స్త్రీ తన చర్మం మెరుస్తూ, మచ్చలు లేకుండా, ముడతలు లేకుండా ఉండాలని కోరుకుంటుంది. కానీ నేటి యుగంలో చిన్నవయసులోనే ముఖం, జుట్టుకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

ఎక్కువ సమయం పాటు ఎండలో ఉండటం, మొటిమలు, వృద్ధాప్యం, మెలస్మా, హార్మోన్ల మార్పులు, ఎవైనా గాయాలు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది తమ అందాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడున్న ఆహారం, జీవనశైలి కూడా ఇందుకు ఒక కారణం. ముఖం ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి ముఖానికి ఏ ఫేస్ మాస్క్ వేయాలో తెలుసుకుందాం

మీకు ముడతలు లేని, స్పష్టమైన, మచ్చలు లేని చర్మం కావాలంటే, వేప ఆయిల్‌తో చేసిన బేస్ మాస్క్ మీకు సరైనది. ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను అధికంగా ఉంటాయి. ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్‌లను కూడా అనేక విధాలుగా తగ్గిస్తుంది. వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ చర్మ కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తాయి. అలాగే, ఇది మెలనిన్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వేప ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కొన్ని వారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం?

ఇవి కూడా చదవండి

వేప ఫేస్‌ ప్యాక్‌ కోసం కావాల్సినవి…

– వేప ఆకులు – ½ కప్పు

– నీళ్లు – 1 నుండి 2 tsp లేదా అవసరమైనంత

– పసుపు పొడి – ½ tsp

వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి..

1. కొన్ని వేప ఆకులు తీసుకుని అందులో తగినన్ని నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

2. ఇలా సిద్ధం చేసిన పేస్ట్‌లో కొంత పసుపు పొడిని మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి.

3. సుమారు 20 నుండి 25 నిమిషాల పాటు ఆరనివ్వండి.

4. తర్వాత మీ ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి.

చర్మ సమస్యలు దూరమవుతాయి..

ఈ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ముఖంపై నల్లటి వలయాలు, ముడతల సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఈ రెసిపీని ప్రయత్నించవచ్చు. అయితే, మీకు వేప కారణంగా ఏదైనా అలెర్జీ లాంటివి ఎదురైతే..అప్పుడు ఖచ్చితంగా మీరు వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..