IRCTC Tours: మధ్యప్రదేశ్ అందాలను చూస్తే ఆశ్చర్యపోతారు.. వర్ణింపశక్యం కానీ ప్రకృతి సోయగాలు.. తక్కువ ధరకే చూసొద్దాం రండి..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అందమైన టూరిస్ట్ స్పాట్ లు ఉన్నాయి. చుట్టూ రాతి కొండలతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలోని జలపాతాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయనడంలో సందేహం లేదు. ఆ ప్రాంతాలను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. సర్‌ప్రైజ్ ఆఫ్ సెంట్రల్ ఇండియా పేరిట తీసుకొచ్చిన ఈ టూర్ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటుంది.
ప్రకృతి అందాలు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది కేరళ. పచ్చని చెట్లు, కాలువలు, కొబ్బరి తోటలు ఆకర్షిస్తాయి. వాటి అందాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో ఉంది. భేదాఘాట్ అనే అందమైన టూరిస్ట్ స్పాట్. చుట్టూ రాతి కొండలతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన నర్మదా నదీ పరీవాహక ప్రాంతం. ఇక్కడి ధువంధార్ జలపాతం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందనడంలో సందేహం లేదు. అటువంటి ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరైనా ఆసక్తి చూపుతారు. అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. సర్‌ప్రైజ్ ఆఫ్ సెంట్రల్ ఇండియా పేరిట తీసుకొచ్చిన ఈ టూర్ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటుంది. ఎంచక్కా హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టూర్ వివరాలు..
- పేరు: సర్‌ప్రైజ్ ఆఫ్ సెంట్రల్ ఇండియా(ఎస్‌హెచ్‌ఏ48)
- వ్యవధి: ఐదు రాత్రులు, ఆరు పగళ్లు
- ప్రయాణ సాధనం: హైదరాబాద్ నుంచి విమానంలో
- ప్రయాణ తేదీ: 2023, అక్టోబర్ 26
- కవరయ్యే ప్రాంతాలు: జబల్‌పూర్, భాండవ్‌ఘర్, అమర్‌కంటక్, రాయ్‌పూర్
పర్యటన సాగుతుందిలా..
డే1(హైదరాబాద్ – జబల్పూర్): సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. రాత్రికి జబల్పూర్ చేరుకొని హోటల్‌కు వెళ్తారు. రాత్రిభోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే2(జబల్పూర్ – భాండవ్‌ఘఢ్): హోటల్‌లో అల్పాహారం చేశాక మార్బుల్ రాక్స్, ధువంధార్ జలపాతాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భాండవ్‌గఢ్‌కు బయలుదేరుతారు. రాత్రికి భాండవ్‌గఢ్ చేరుకొని హోటల్లో రాత్రి భోజనం చేసి బస చేస్తారు.
డే3(భాండవ్‌ఘఢ్): హోటల్‌లో అల్పాహారం చేశాక సఫారీకి వెళ్తారు. రాత్రికి భాండవ్‌గఢ్‌లోనే బస చేస్తారు.
డే4(భాండవ్‌ఘఢ్ – అమర్‌కంటక్): హోటల్‌లో అల్పాహారం చేశాక అమర్‌కంటక్‌కు బయలుదేరి వెళ్తారు. శ్రీ యంత్ర మందిర్, కలచూరి దేవాలయాలు, నర్మదా నదీ ఘాట్‌ను సందర్శిస్తారు. అమర్‌కంటక్ లోని హోటల్లో రాత్రి భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
డే5(అమర్‌కంటక్ – రాయ్‌పూర్): హోటల్‌లో అల్పాహారం చేశాక, రాయ్‌పూర్‌కి బయలుదేరుతారు. సాయంత్రానికి రాయ్‌పూర్ చేరుకుంటారు. హోటల్లో రాత్రి భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
డే6(రాయ్‌పూర్ – హైదరాబాద్): హోటల్‌లో అల్పాహారం చేశాక సిర్పూర్ వెళ్తారు. అక్కడ లక్ష్మణ్ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి రాయ్‌పూర్‌కు బయలుదేరుతారు. సాయంత్రం రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.
ప్యాకేజీ ధరలు ఇలా..
విమానంలో వెళ్లి వచ్చే ఈ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. హోటల్లో ప్రత్యేకంగా సింగిల్ రూం కావాలనుకొంటే రూ. 43100 చార్జ్ చేస్తారు. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 35,450, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 34050 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్ అవసరం అయితే రూ. 31250, ప్రత్యేకమైన బెడ్ అవసరం లేకపోతే రూ. 26850 చార్జ్ చేస్తారు. అలాగే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్ లేకుండా రూ. 23300 తీసుకుంటారు.
ప్యాకేజీలో ఇవి కవరవుతాయి..
విమాన టికెట్లు (హైదరాబాద్-జబల్పూర్ / రాయ్‌పూర్-హైదరాబాద్), 5 అల్పాహారం, 5 డిన్నర్, 1 లంచ్ అందిస్తారు. లోకల్ ప్రయాణాలకు ఏసీ టెంపో ట్రావెలర్ సదుపాయం, ప్రయాణ బీమా, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు లభిస్తాయి. అయితే మధ్యాహ్న భోజనం, విమానంలో ఆహారం, ఫారెస్ట్ సఫారీలకు స్థానిక దేవాలయాల్లో దర్శన టికెట్ల పర్యాటకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ వెబ్ సైట్లోకి వెళ్లి, టూర్ ప్యాకేజెస్ విభాగంలో సర్‌ప్రైజ్ ఆఫ్ సెంట్రల్ ఇండియా ప్యాకేజీని ఎంపికచేసుకొని తెలుసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..