IRCTC Tours: హైదరాబాద్ టు తిరుపతి ట్రిప్.. రెండు రోజుల్లోనే ఐదు ఆధ్యాత్మిక క్షేత్రాలు.. అతి తక్కువ ధరలో ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..

ప్రశాంత వాతావరణంలో తిరుమల గిరిపై కొలువైన శ్రీవేంకటేశ్వరుడిని దర్శించి తరించాలని కోరుకుంటారా? అయితే ఐఆర్ సీటీసీ టూరిజమ్ అదిరిపోయే టూర్ ప్యాకేజీని మీ కోసం అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ నడుపుతోంది. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ ను కూడా సందర్శించొచ్చు.

IRCTC Tours: హైదరాబాద్ టు తిరుపతి ట్రిప్.. రెండు రోజుల్లోనే ఐదు ఆధ్యాత్మిక క్షేత్రాలు.. అతి తక్కువ ధరలో ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..
Tirupati
Follow us
Madhu

|

Updated on: Aug 20, 2023 | 3:30 PM

ఆంధ్రా ఆధ్యాత్మిక రాజధానిని దర్శించాలనుకొంటున్నారా? నిత్యం వేదనాదంతో మార్మోగే నగరాన్ని వీక్షించాలని భావిస్తున్నారా? చుట్టూ కొండలు, కొండలపై పచ్చని అటవీ సంపదను చూసి ఆస్వాదించాలని ఆలోచిస్తున్నారా? అన్నింటికన్నా మించి ప్రశాంత వాతావరణంలో తిరుమల గిరిపై కొలువైన శ్రీవేంకటేశ్వరుడిని దర్శించి తరించాలని కోరుకుంటారా? అయితే ఐఆర్ సీటీసీ టూరిజమ్ అదిరిపోయే టూర్ ప్యాకేజీని మీ కోసం అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ నడుపుతోంది. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ ను కూడా సందర్శించొచ్చు. ప్రతి మంగళవారం, గురువారం హైదరాబాద్ నుంచి విమానంలో తీసుకెళ్లి తీసుకొస్తారు. ఇంకెందుకు ఆలస్యం తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ ప్రత్యేక టూర్ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఇది ప్యాకేజీ..

ఐర్సీటీసీ ప్యాకేజీ పేరు: తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్(ఎస్ హెచ్ఏ01)

వ్యవధి: ఒక రాత్రి,రెండు పగళ్లు

ఇవి కూడా చదవండి

ప్రయాణ సాధనం: హైదరాబాద్ నుంచి విమానంలో..

ప్రయాణ తేదీలు: ప్రతి మంగళవారం, గురువారం

సందర్శించే ప్రాంతాలు: కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, తిరుపతి

పర్యటన సాగుతిందిలా..

డే1(హైదరాబాద్-తిరుపతి): ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచాపూర్ లను సందర్శిస్తారు. సాయంత్రానికి తిరుపతికి వచ్చి హోటల్ లో చెకిన్ అయ్యి, అక్కడే డిన్నర్ చేసి బస చేస్తారు.

డే2(తిరుపతి-హైదరాబాద్): ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసి, తిరుమల కొండపైకి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక దర్శన మార్గం గుండా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొంటారు. తిరిగి హోటల్ కు చేరుకొని మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత హోటల్లో చెక్ అవుట్ చేసి శ్రీకాళహస్తికి చేరుకుంటారు. అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని తిరుపతి ఎయిర్ పోర్టులో ఐఆర్ సీటీసీ సిబ్బంది డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి విమానంలో తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

హోటల్లో సింగిల్ షేరింగ్ అయితే ఒక్క మనిషికి రూ. 16,330 చార్జ్ చేస్తారు. డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ అయితే రూ. 14,645 తీసుకుంటారు. అదే ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 13,740 ఖర్చు అవుతుంది. అలాగే ఐదేళ్ల నుంచి 11ఏళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ తో అయితే రూ. 13,740 చార్జ్ చేస్తారు. బెడ్ అవసరం లేకపోతే రూ. 13,490 తీసుకుంటారు. రెండేళ్ల నుంచి 4 వరకూ పిల్లలకు బెడ్ లేకుండా రూ. 13,490 వసూలు చేస్తారు. రెండేళ్ల కంటే తక్కువ వయస్సున్న శిశులకు దాదాపు రూ. 15,00 ఎయిర్ పోర్టులో చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో కవర్ అయ్యేవి ఇవే..

హైదరాబాద్ నుంచి తిరుపతి, అలాగే తిరుపతి నుంచి హైదరాబాద్ కు విమాన టికెట్లు ప్యాకేజీలో కవర్ అవుతాయి. అలాగే 24 గంటల పాటు ఏసీ హోటల్ రూం అకామిడేషన్ ఇస్తారు. ఒక బ్రేక్ ఫాస్ట్, ఒక మధ్యాహ్న భోజనం, ఒక రాత్రి భోజనం కవర్ అవుతుంది. లోకల్లో తిరగడానికి ఏసీ సదుపాయం కలిగిన వాహనం అందిస్తారు. తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం లో దర్శనం కల్పిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ కల్పిస్తారు.

అయితే పర్యాటకులు తప్పనిసరిగా నిర్ధిష్టమైన వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి. జీన్స్, టీషర్టులు నిషిద్ధం. తప్పనిసరిగా పురుషులు వైట్ ధోటీ, షర్టుల లేదా కుర్తాస్, పైజమాస్ వేసుకోవాలి. అలాగే మహిళలు సంప్రదాయ చీర లేదా సల్వార్ ఖమీజ్ ధరించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..