Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మొదటిసారి అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..

జంతువుల ప్రపంచంలో మనం నమ్మలేని, దగ్గరగా చూడలేని అనేక సందర్భాలను ప్రపంచంలో చూస్తాము. ముఖ్యంగా జంతువులలో పాములు, కోతులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్ల వీడియోలకు నెటిజన్లలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రజలు అలాంటి వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా.

Watch: మొదటిసారి అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..
Bear Saw Itself In Mirror
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 05, 2023 | 11:38 AM

ఇంటర్నెట్ ప్రపంచం ఎన్నో అద్భుతాలతో కూడిన విభిన్న ప్రపంచం. ఇక్కడ మనం అనేకానేక భిన్నమైన విషయాల గురించి తెలుసుకుంటాం. ఇక్కడ షేర్ చేయబడిన చేసే విషయాలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. ఇది ఉపయోగకరమైన సమాచారంతో పాటు వినోద మార్గం కూడా. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. ఇక ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా జంతువుల వీడియోల వీక్షించే ప్రత్యేక అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జంతువుల ప్రపంచంలో మనం నమ్మలేని, దగ్గరగా చూడలేని అనేక సందర్భాలను ప్రపంచంలో చూస్తాము. ముఖ్యంగా జంతువులలో పాములు, కోతులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్ల వీడియోలకు నెటిజన్లలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రజలు అలాంటి వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా.

అడవిలో ఎలుగుబంటికి సంబంధించిన ఒక విచిత్రమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇందులో అనుకోని సంఘటన జరుగుతుంది. ఇది చూడటానికి చాలా విచిత్రంగా, సరదాగా కనిపించింది. ఎలుగుబంటికి సంబంధించి ఈ ఫన్నీ వీడియో చూస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు.

ఇవి కూడా చదవండి

వీడియో ప్రారంభంలో ఒక ఎలుగుబంటి దట్టమైన అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఎలుగు తిరుగున్న ప్రదేశంలో ఒక చెట్టుకు పెద్ద అద్దం అమర్చి ఉంది. అనుకోకుండా అక్కడికి వచ్చిన ఎలుగుబంటికి ఒక్కసారిగా ఆ అద్దంలో తన ముఖం కనిపిస్తుంది. ఎలుగుబంటి అద్దంలో తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా కంగుతింటుంది. భయంతో ఎగిరిపడుతుంది. తనలాంటి మరో జంతువు తనపై దాడికి వచ్చిదని కంగారు పడింది. వెంటనే దానిపై ఎదురు దాడికి ప్రయత్నించింది. అందాన్ని కిందపడేసి తొక్కేస్తుంది. అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి రియాక్షన్ మనల్ని నవ్విస్తుంది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో షేర్ చేశారు. దీనికి 14.8 మిలియన్లకు పైగా వీక్షణలు, లెక్కలేనన్ని లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని… ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోయాను అంటూ పలువురు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..