Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skipping benefits: ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో.. తెలిస్తే ఈరోజే మీరు కూడా మొదలెడతారు..

స్కిప్పింగ్‌ అనేది సరళమైన, ఈజీ ఎక్సర్ సైజులలో ఒకటిగా పరిగణిస్తారు ఆరోగ్య నిపుణులు. రోజుకు కేవలం 15 నిమిషాల స్కిప్పింగ్‌తో ఇన్ని ప్రయోజనాలు పొందుతారు. అది కూడా ఎలాంటి ఖర్చులేకుండానే.. మరీంకెందుకు ఆలస్యం ఈ వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

Skipping benefits: ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో.. తెలిస్తే ఈరోజే మీరు కూడా మొదలెడతారు..
Skipping
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 05, 2023 | 8:46 AM

కనీసం ఒక్కసారైనా స్కిప్ చేయని వారు ఉండరు. చిన్ననాటి కాలక్షేపంగా స్కిప్పింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కానీ, వయసు పెరిగే కొద్దీ స్కిప్పింగ్ మన జీవితాల్లోంచి మాయమైపోయింది. అయితే, స్కిప్పింగ్ అనేది ఆట మాత్రమే కాదు, ఇది గొప్ప వ్యాయామం. ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లడానికి సమయం, సౌకర్యం లేని వారి కోసం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి స్కిప్పింగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడిన మార్గం. మనలో చాలా మంది చిన్నతనంలో స్కిప్పింగ్ చేశాం. అప్పట్లో ఇది ఆటలో భాగం. కానీ ఈరోజు వేరు. నేడు, స్కిప్పింగ్ అనేది ఒక మంచి వ్యాయామంగా చాలా ముఖ్యమైనది.

స్కిప్పింగ్ అనేది కేవలం ఆట కాదు. ఇది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది మొత్తం శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. స్కిప్పింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్కిప్పింగ్ అనేది పూర్తి శరీరానికి వ్యాయామం. రోజూ అరగంట సేపు స్కిప్ చేయడం వల్ల మీ శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా స్కిప్పింగ్ గొప్ప వ్యాయామం.

స్కిప్పింగ్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది గుండె పనితీరును సజావుగా చేయడంలో సహాయపడుతుంది. గుండెను దృఢంగా మార్చడంతో పాటు, స్కిప్పింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీర సమతుల్యత, బలాన్ని మెరుగుపరచడానికి స్కిప్పింగ్ గొప్పగా పనిచేస్తుంది. కొంచెం శ్రద్ధ, ఏకాగ్రమైన మనస్సుతో మాత్రమే స్కిప్పింగ్ సరిగ్గా చేయగలరు.. రెగ్యులర్ స్కిప్పింగ్ శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా ఉండి శరీరానికి మరింత బలం చేకూరుతుంది. కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

స్కిప్పింగ్ ఆడ,మగ అనే తేడాలేకుండా..ఇద్దరిలోనూ నిమిషానికి 25 నుండి 30 కిలో కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంటే మీరు కేవలం అరగంటలో 600 కిలో కేలరీలు బర్న్ చేయవచ్చు. అంతేకాదు.. స్కిప్పింగ్‌తో మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఇతరాత్ర ఆలోచనలు మనసులో పెట్టుకుని స్కిప్పింగ్‌ చేయటం సాధ్యం కాదు. మీరు స్కిప్పింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత లేకపోతే, మీరు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, స్కిప్పింగ్ అలవాటు చేసుకోవడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుందని, మీ తెలివితేటలు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్కిప్పింగ్‌ అనేది సరళమైన, ఈజీ ఎక్సర్ సైజులలో ఒకటిగా పరిగణిస్తారు ఆరోగ్య నిపుణులు. రోజుకు కేవలం 15 నిమిషాల స్కిప్పింగ్‌తో ఇన్ని ప్రయోజనాలు పొందుతారు. అది కూడా ఎలాంటి ఖర్చులేకుండానే.. మరీంకెందుకు ఆలస్యం ఈ వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..