- Telugu News Photo Gallery Planning to Travel In Monsoon? visit these beautiful tourist places of Rajasthan
Monsoon Tour: వర్షాకాలాన్ని ప్రకృతి ఒడిలో గడపాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి..
Monsoon Travel: వర్షాకాలపు వాతావరణం పర్యటనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతి పచ్చదనంతో అలకరించి ఉంటుంది. అయితే వర్షాకాలంలో చాలా మంది సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజస్థాన్‌ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు. అందుకు కారణం కూడా లేకపోలేదు, ఎడారి రాష్ట్రంగా పేరున్న రాజస్థాన్ వర్షాకాలపు వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా రాజస్థాన్‌ని సందర్శించాలనుకుంటే అక్కడ సందర్శించదగ్గ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. తప్పకుండా వాటిని సందర్శించండి.
Updated on: Sep 05, 2023 | 8:29 AM

మౌంట్ అబూ: రాజస్థాన్‌లోని మౌంట్ అబూ పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం. హనీమూన్ డెస్టినేషన్‌గా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.

భాన్‌గర్ కోట: చిన్న చిన్న కొండల మధ్యలో ఉన్న భాన్‌గర్ కోట వర్షాల కారణంగా పచ్చదనంతో చుట్టుముడుతుంది. దెయ్యాల కోటగా పిలువబడే ఈ కోట అందం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు.

ఉదయపూర్: అనేక చారిత్రక కట్టడాలకు నిలయమైన ఉదయపూర్ రాజవంశాల చరిత్రకే కాక పచ్చదనానికి కూడా పేరుగాంచింది. ఉదయపూర్‌లో అనేక అందమై కొండలు ఉన్నాయి. ఇక వర్షాకాలంలో వాటి అందం రెట్టింపు అవుతుంది.

జైపూర్: రాజస్థాన్ పర్యటన గురించి మాట్లాడితే, జైపూర్ నగరాన్ని ఎలా మరచిపోగలరు. పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన జైపూర్‌లోని అమెర్ కోటతో సహా అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఇష్టపడతారు.

సజ్జన్‌గఢ్ ప్యాలెస్: రాజస్థాన్‌లోని మరో పర్యాటక ప్రదేశం సజ్జన్‌గఢ్ ప్యాలెస్. అనేక సరస్సులతో బోటింగ్‌కి అనుకూలంగా ఉండే ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది.





























