AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మో.. పిల్ల కాదు పిడుగు.. భయంకర పాములను కౌగిలించుకుని హాయిగా నిద్రపోతుంది..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అరియానా అనే అమ్మాయికి పాములంటే చాలా ఇష్టం. ఆమె వివిధ రకాల పాములతో స్నేహం చేసే అనేక వీడియోలను ఇంటర్ నెట్ లో పోస్ట్ చేస్తుంది.  ఈ వీడియో ఫుటేజీని ఇప్పటికే 2,23,000 మందికి పైగా వీక్షించారు. 62,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అమ్మో... ఈమే పిల్ల కాదు.. పిడుగు అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

Viral Video: అమ్మో.. పిల్ల కాదు పిడుగు.. భయంకర పాములను కౌగిలించుకుని హాయిగా నిద్రపోతుంది..
Girl Sleeps With Snakes
Jyothi Gadda
|

Updated on: Sep 05, 2023 | 8:30 AM

Share

పాములు ఈ పేరు ఒక్కటే చాలు మనలో చాలా మందిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అక్కడెక్కడో పాము ఉందని తెలిస్తే చాలు.. ఇక్కడ నుంచే ప్రజలు భయంతో పరుగులు పెట్టాల్సిందే. అత్యంత విషపూరితం, భయపెట్టే జీవులలో పాము ఒకటి. వీటిలో కొన్ని ప్రాణాంతక విష సర్పాలు కూడా ఉన్నాయి. పాము విషం కొద్ది మొత్తంలో కూడా మరణానికి కారణమవుతుంది. అయితే, కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకోవటం ఇటీవల సోషల్ మీడియా ద్వారా అనేకం చూస్తున్నాం. ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. పాములతో మంచంపై పడుకున్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి చుట్టూ పాములు అల్లుకుని కనిపిస్తున్నాయి. అదులో చాలా రకాల పాములు పెద్దవి, చిన్నవి అనేకం ఉన్నాయి. అవన్ని ఆ చిన్నారిని హత్తుకుని నిద్రపోతున్నట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. మంచం నిండా పాములు, పైగా ఆ పాములు కూడా చిన్నారికి చాలా దగ్గరగా, ఆమెను చుట్టుకుని కనిపిస్తున్నాయి. అన్ని పాములను పక్కన పెట్టుకుని ఆ చిన్నారి చిచ్చరపిడుగు హాయిగా నిద్రపోతుంది. ఇది చూస్తున్న జనాలకు గుండె ఆగిపోయినంత పనైంది. ఇదేదో పీడకలేమో అనిపించేలా ఉంది. కానీ, ఈ అమ్మాయికి ఇది రోజువారీ దినచర్యలో భాగమేనని వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ వీడియోను స్నేక్ మాస్టర్ ఎక్సోటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అరియానా అనే అమ్మాయికి పాములంటే చాలా ఇష్టం. ఆమె వివిధ రకాల పాములతో స్నేహం చేసే అనేక వీడియోలను ఇంటర్ నెట్ లో పోస్ట్ చేస్తుంది.  ఈ వీడియో ఫుటేజీని ఇప్పటికే 2,23,000 మందికి పైగా వీక్షించారు. 62,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

వీడియో చూసిన కొంతమంది వీక్షకులు పాములతో సన్నిహితంగా, వ్యక్తిగతంగా ఉండటం ప్రమాదమంటూ ఆందోళన చెందుతున్నారు. పాములు బొమ్మలు కావు.. అలా భయంలేకుండా వాటితో ఆడుకోవటం ప్రమాదం అంటూ కొందరు సూచించారు. పాములను పెంపుడు జంతువులుగా ఇళ్లలో ఉంచుకునే వాళ్లు.. వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆలోచించుకోవాలని మరికొందరు అరియానాకు కామెంట్స్‌లో సూచిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న పాములు విషపూరితమైనవి, ప్రమాదకరమైనవి అని మరొకరు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సీన్ కలలో కూడా ఊహించలేమని మరోకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..