Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birds Suicide: ఇదో మిస్టీరియస్‌ సూసైడ్‌ స్పాట్‌.. ఇక్కడికి వచ్చిమరీ చనిపోతున్న పక్షులు.. ఎక్కడో కాదు మనదేశంలోనే..

దీనికి దుష్టశక్తులు తమకు సందేశాలు పంపుతున్నాయని చాలా ఏళ్లుగా ఇక్కడి గ్రామస్థులు నమ్ముతున్నారు. వారు చెడు నుండి తమను తాము రక్షించుకోవడానికి వారి చుట్టూ వెదురు స్తంభాలను నిర్మించుకున్నారు. ఈ వింత దృగ్విషయం సాక్ష్యాన్ని అనేక జానపద కథలుగా అల్లుకుని ఇక్కడి స్థానికులు చెప్పుకుంటుంటారు. ఇన్ని పక్షులు కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాయో ఇక్కడి ప్రజలకు అర్థం కాలేదు.

Birds Suicide: ఇదో మిస్టీరియస్‌ సూసైడ్‌ స్పాట్‌.. ఇక్కడికి వచ్చిమరీ చనిపోతున్న పక్షులు.. ఎక్కడో కాదు మనదేశంలోనే..
Birds Commit Suicide
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 04, 2023 | 2:22 PM

భారతదేశంలో పక్షులు ఆత్మహత్య చేసుకునే ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా..? అవును మీరు చదివింది నిజమే..అలాంటి ఒక ప్రదేశం ఉంది. అది జటింగా అనే ఈ గ్రామం..ఈ గ్రామంలో పక్షులు పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి చేసుకుంటాయని ప్రాచుర్యంలో ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఈ ప్రదేశంలో పక్షుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వార్తలు వస్తుంటాయి. స్థానికంగా కనిపించే పక్షులే కాదు.. వలస పక్షులు కూడా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. భారతదేశంలోని ఆ గ్రామం పూర్తి వివరాలు ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం..

జటింగా అస్సాంలోని గౌహతికి దక్షిణాన 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ గ్రామాన్ని పక్షులు ఆత్మహత్యలకు పాల్పడే వింత గ్రామంగా పిలుస్తారు. అనేక నివేదికలు, సోషల్ మీడియా ద్వారా చాలా సందర్బాల్లో చెప్పినట్టుగా.. ఆగస్టు, నవంబర్ నెలల్లో వివిధ జాతుల పక్షులు ఇక్కడ మిస్టీరియస్‌గా చనిపోతుంటాయి. సుదూర ప్రాంతాల నుండి వసల వచ్చిన పక్షులు కూడా ఇక్కడకు వచ్చాక చనిపోతాయి.

చంద్రకాంతి లేని చీకటి రాత్రులు, అమావాస్య సందర్బాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని.. దీనికి దుష్టశక్తులు తమకు సందేశాలు పంపుతున్నాయని చాలా ఏళ్లుగా ఇక్కడి గ్రామస్థులు నమ్ముతున్నారు. వారు చెడు నుండి తమను తాము రక్షించుకోవడానికి వారి చుట్టూ వెదురు స్తంభాలను నిర్మించుకున్నారు. ఈ వింత దృగ్విషయం సాక్ష్యాన్ని అనేక జానపద కథలుగా అల్లుకుని ఇక్కడి స్థానికులు చెప్పుకుంటుంటారు. ఇన్ని పక్షులు కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాయో ఇక్కడి ప్రజలకు అర్థం కాలేదు. ఈ సంఘటనలు కొన్ని వాతావరణ పరిస్థితులతో సంవత్సరంలో ఒక సమయంలో మాత్రమే జరుగుతాయని మాత్రం గ్రామస్తులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

జటింగాలో పక్షుల మిస్టీరియస్ మరణాలకు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. దాంతో పరిశోధకులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. అనేక అధ్యయనం చేపట్టారు. నిపుణుల అధ్యయనం ప్రకారం .. ఇక్కడ అయస్కాంత శక్తి ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చలికాలంలో పొగ మంచు ఎక్కువగా పడుతుందని గుర్తించారు. దీనికి తోడు వేగంగా వీచే గాలులు కూడా పక్షులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. చీకటి ఎక్కువగా ఉండడంతో..ఇక్కడికి వచ్చిన పక్షులు.. స్పష్టంగా చూడలేక ఇళ్లు, చెట్లను ఢీకొట్టి చనిపోతున్నాయని చెబుతున్నారు.

ఈ దృగ్విషయం వెల్లడైన తరువాత, పరిశోధకులు గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి, ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో పక్షుల మరణాల వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..