Variety Marriage: గోదారోళ్ల మజాకా..! అదరగొట్టిన పెళ్లి సందడి.. వింత వేషధారణతో బుల్లెట్ బైకులపై..
అన్నిటింకి మించి బుల్లెట్టు బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసిన యువతులు రథంపై పెళ్లి జంట ఊరేగింపు పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కోనసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం చూశాం కానీ.. వైవిధంగా చేసిన ఇలాంటి వివాహం ఈమధ్య కాలంలో చూడలేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 05: గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకం. వెటకారమైనా.. మమకారమైనా.. అభిమానమైనా.. ఆప్యాయతైనా.. మర్యాదలైనా.. గోదారోళ్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. అంటూ మొదలుపెడతారు. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే. పెళ్లి భోజనం దగ్గర నుంచి.. అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. ఇక, కోనసీమలో పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దానికి ఉదాహరణే ఈ పెళ్లి.
కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాదకరమైన పచ్చ పచ్చని పైర్లు, ఆకు పచ్చని కొబ్బరి చెట్లు.. వాటి చుట్టూ కాలువలు, అక్కడక్కడ అందమైన గోదావరీ నదీ.. పారే సెలయేర్లు, దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలతో పెండ్లి కొడుకు, పెళ్లికూతురు ఊరేగుతుంటే.. మహారాష్ట్ర తరహాలో అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ కొడుకు కల్యాణ రిసెప్షన్ కన్నుల పండగను మించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. సుఖేష్, శ్రీ రంగనాయకి వినూత్న ఊరేగింపు, బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు, పెళ్ళి కొడుకు, కుమార్తె ఊరేగింపులు ఇలా ఒక్కటేమిటీ మాటల్లో చెప్పలేని వైవిధ్యంగా సాగింది….
అన్నిటింకి మించి బుల్లెట్టు బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసిన యువతులు రథంపై పెళ్లి జంట ఊరేగింపు పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కోనసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం చూశాం కానీ.. వైవిధంగా చేసిన ఇలాంటి వివాహం ఈమధ్య కాలంలో చూడలేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..