అంధకారంలో కర్నూల్ ఆసుపత్రి.. సెల్‌ఫోన్ టార్చ్‌లైట్‌తోనే వైద్యం.. తమ సమస్యలు అధికారులకు పట్టవా అంటూ వాపోతున్న రోగులు..
కర్నూలు జిల్లా: రోగులు ఇన్ని బాధలు పడుతున్నా హాస్పిటల్‌లో శాశ్వత పరిష్కారం కోసం అధికారుల ప్రయత్నించకపోవడం ఘోరమని ఆసుపత్రికి వచ్చిన రోగులు వాపోతున్నారు. రెండు నియోజకవర్గాల రోగులతో నిత్యం కిట కిటలాడుతుంది ఆ ప్రభుత్వ ఆసుపత్రి. ఎవరికి ఎటువంటి సంఘటన జరిగిన చుట్టుపక్కల గ్రామాల,పట్టణ ప్రజలు,ఆ ఆసుపత్రికి వెళ్ళసిందే.24 గంటలు వైద్యం అందిచే ఆసుపత్రి అది. కానీ అక్కడ వెళ్లిన రోగులకు మాత్రం ఆసుపత్రిలో కరెంట్ పోతే ఇంకా టార్చి లైట్లు..
కర్నూలు జిల్లా, సెప్టెంబర్ 5: వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కరెంటు సమస్యతో విలవిలలాడుతోంది. టార్చ్ లైట్ లు, సెల్ఫోన్ల వెలుతురులో వైద్యం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోగులు, బాలింతలు, శిశువులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇది ఏదో ఈ ఒక్కరోజు సమస్య కాదు నిత్యం వెంటాడుతున్న నరకం. అయినా శాశ్వత పరిష్కారం కోసం అధికారుల ప్రయత్నించకపోవడం ఘోరమని ఆసుపత్రికి వచ్చిన రోగులు వాపోతున్నారు. రెండు నియోజకవర్గాల రోగులతో నిత్యం కిట కిటలాడుతుంది ఆ ప్రభుత్వ ఆసుపత్రి. ఎవరికి ఎటువంటి సంఘటన జరిగిన చుట్టుపక్కల గ్రామాల, పట్టణ ప్రజలు, ఆ ఆసుపత్రికి వెళ్ళల్సిందే. 24 గంటలు వైద్యం అందిచే ఆసుపత్రి అది. కానీ అక్కడ వెళ్లిన రోగులకు మాత్రం ఆసుపత్రిలో కరెంట్ పోతే ఇంకా టార్చి లైట్లు వేసుకొని రోగులకు వైద్యం అందిస్తున్న ఆ ప్రభుత్వ ఆసుపత్రిపై టీవీ9 ప్రత్యేక కథనం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గ రోగులతో కిటకిటలాడుతోంది.ఆ ఆసుపత్రిలో దాదాపు 14 మంది వైద్యులు,60 మంది సిబ్బందితో రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు.రోజు 350 నుండి 400 మంది రోగులు వస్తుంటారు. అయితే అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు విద్యుత్ అందక రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేసే వైద్యులకు మాత్రం నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ రోగులకు అందించే సేవలు మాత్రం మరిచి పోయారు. 100 పడకల ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క జనరేటర్ ఉన్న దానికి డీజిల్ వేయలేక పోతున్నారు.
ఒక్కసారి కరెంట్ పోతే ఉన్న ఇన్వర్టర్ నిమిషాల వ్యవధి పని చేసి ఆఫ్ కావడంతో అక్కడ వైద్యులు టార్చి లైట్లు వేసుకొని రోగులకు వైద్యం అందిస్తున్నారు. నేడు ఆసుపత్రిలో ఉదయం 7 గంటల నుండి 11 గంట వరకు విద్యుత్ లేకపోవడంతో రోగులు అల్లడిపోయారు. మరో పక్క విద్యుత్ పోతే అప్పుడే పుట్టిన పురిటి బిడ్డకు, బాలింతలకు, ఫ్యాన్ గాలి అందక వేడికి అల్లడిపోయారు. ఇలా కరెంట్ పోయిన ప్రతి సారి రోగులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చర్యలు చేపట్టి ఇక్కడ 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని రోగులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..