IND vs NEP: నేడే నేపాల్‌తో భారత్ కీలక పోరు.. మ్యాచ్‌కి వర్షం ముప్పు.. అలా జరిగితే పాక్‌తో మళ్లీ తలపడే అవకాశం..
IND vs NEP: వర్షం కారణంగా రద్దయిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన పల్లెకలె మైదానంలోనే నేటి భారత్, నేపాల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ వేయనుండగా, ఆట 3 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బూమ్రా వ్యక్తిగత కారణాలతో శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతని స్థానంలో స్టార్ ప్లేయర్..
IND vs NEP, Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీ 5వ మ్యాచ్‌లో భారత్, నేపాల్ తలపడబోతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, నేపాల్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో నేపాల్‌పై విజయం సాధిస్తేనే.. రోహిత్ సేన సూపర్ 4 రౌండ్‌కి చేరుకుంటుంది. మరోవైపు గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ ముందుగానే సూపర్ 4కు చేరుకుంది. ఈ క్రమంలోనే నేపాల్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవడం తప్పనిసరిగా మారింది. వర్షం కారణంగా రద్దయిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన పల్లెకలె మైదానంలోనే నేటి మ్యాచ్ కూడా జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ వేయనుండగా, ఆట 3 గంటలకు ప్రారంభం అవుతుంది.
అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బూమ్రా వ్యక్తిగత కారణాలతో శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతని స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ షమి జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మార్పు మినహా పాకిస్తాన్‌తో తలపడిన జట్టుతోనే నేపాల్‌పై కూడా ఆడాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. మరోవైపు నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ కూడా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆడిన జట్టుతోనే టీమిండియాతో కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది.
Jasprit Bumrah left for Mumbai, won't be available for Nepal game but will play from Super 4 stage. [Dainik Jagran]
– He is fully fit. pic.twitter.com/gkHJD8aHOX
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
మళ్లీ వర్షం ముప్పు..
భారత్, నేపాల్ మధ్య జరిగే నేటి మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ విజయం రోహిత్ సేనకు కీలకం కాగా, ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్, నేపాల్‌కి చెరో పాయింట్ లభిస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ రద్దవడం ద్వారా 1 పాయింట్ పొందిన భారత్.. మొత్తం 2 పాయింట్లతో నేరుగా సూపర్ 4 రౌండ్‌కి చేరుతుంది. అదే జరిగితే సూపర్ 4 దశలో భారత్, పాక్ మ్యాచ్ కొలొంబో వేదికగా మరో సారి జరుగుతుంది. అలాగే ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ఆడుతున్న నేపాల్ నిరాశతో ఇంటి బాట పడుతుంది.
Ind VS Nep... #India #Nepal #AsiaCup2023 pic.twitter.com/xgu3mUrJRB
— RVCJ Sports (@RVCJ_Sports) September 2, 2023
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్(అంచనా):
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ.
నేపాల్ జట్టు: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆరీఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..