- Telugu News Photo Gallery Cricket photos Ishan Kishan Breaks Virat Kohli's Elite Record During His 82 knock Against Pakistan In Asia Cup 2023
IND vs PAK: విరాట్ కోహ్లీ ‘పరుగులను’ అధిగమించిన ఇషాన్ కిషన్.. ఆ లిస్టులో 105+ స్ట్రైక్‌రేట్‌తో ఒకే ఒక్క ప్లేయర్‌గా రికార్డ్..
IND vs PAK: ఆసియా కప్ 2023 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా టాప్ ఆర్డర్ తలపడింది. అయితే కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో అవకాశం అందుకున్న ఇషాన్ కిషన్ 5వ నెంబర్‌లో వచ్చి పాక్ బౌలర్లను ఉతికేశాడు. తన 17వ వన్డే ఇన్నింగ్స్‌ని పాక్‌పై ఆడిన ఇషాన్ 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ పరుగలను కూడా అధిగమించడం విశేషం.
Updated on: Sep 03, 2023 | 8:48 AM

పాక్‌పై 82 పరుగులు చేసిన ఇషాన్.. తొలి 17 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్ తన 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఇషాన్ పేరిట ఓ డబుల్ సెంచరీ (బంగ్లాపై 210) కూడా ఉంది.

అయితే విరాట్ కోహ్లీ తన తొలి 17 ఇన్నింగ్స్‌ల్లో 757 పరుగులే చేశాడు. తద్వారా ఇషాన్ తన తొలి 17 ఇన్నింగ్స్‌లో కోహ్లీ కంటే 19 పరుగులు ఎక్కువ చేసి రెండో స్థానానికి చేరుకోగా, విరాట్ మూడో స్థానానికి దిగాడు.

ఈ లిస్టు నాల్గో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. అయ్యర్ తన తొలి 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 750 పరుగులు చేశాడు.

ఇక ఈ లిస్టు అగ్రస్థానంలో శుభమాన్ గిల్ ఉన్నాడు. గిల్ తన తొలి 17 ఇన్నింగ్స్‌ల్లో 778 పరుగులు చేశాడు. ఇందులో అతను న్యూజిలాండ్‌పై చేసిన 208 పరుగుల డబుల్ సెంచరీ కూడా ఉంది.

కాగా, తొలి 17 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఈ టాప్ 4 ప్లేయర్ల లిస్టులో ఇషాన్ కిషన్ మాత్రమే 105+ స్ట్రేక్ రేట్‌కి కలిగి ఉండడం విశేషం.





























